మహారాష్ట్రలో హైదరాబాద్ ట్రెక్కర్ మృతి | Hyderabad trekker found dead in Maharashtra | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 8 2016 7:26 AM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM

ట్రెక్కింగ్ కోసం మహారాష్ట్రకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన ట్రెక్కర్ రిచిత గుప్త ప్రమాదవశాత్తు మరణించారు. కుటుంబీకులకు సమాచారం లేకుండా ఒంటరిగా ట్రెక్కింగ్‌కు వెళ్లిన రిచితకు సంబంధించి నారా యణగూడ ఠాణాలో మిస్సింగ్ కేసు నమోదైంది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆమె ముంబై వెళ్లినట్టు గుర్తించారు. పన్వేల్ సమీపంలోని ప్రముఖ ట్రెక్కింగ్ ప్రాంత మైన ప్రబల్‌గఢ్ కోట సమీపంలో రిచిత మృతదేహం మంగళ వారం లభించింది. ప్రాథమిక ఆధారాలు, మృతదేహం పడున్న స్థితుల్ని అధ్యయనం చేసిన పోలీసులు ప్రమాదంగా తేల్చారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement