రూపాయికే శస్త్రచికిత్సలు
కూకట్పల్లిలోని ఆకార్ ఆశా సెంటర్ ఫర్ ఎనేబుల్మెంట్ ఆఫ్ ఫిజికల్లీ డిజేబుల్డ్ వికలాంగుల కోసం రూపాయికే శస్త్రచికిత్సలు నిర్వహించనుంది. నగరంలోని పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రమాదాల కారణంగా అంగవైకల్యానికి గురైన వారి కోసం రూపాయికే శస్త్రచికిత్సా శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వా హకులు తెలిపారు. అర్హులైన రోగుల ఎంపిక కోసం పారిశ్రామిక సంస్థల్లో అవగాహన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 25 మంది వికలాంగులను శస్త్రచికిత్సల కోసం ఎంపిక చేశారు. త్వరలోనే వీరికి రూపాయికే శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు.
- సాక్షి, సిటీప్లస్