అదరగొట్టిన ఐటీ దిగ్గజం
ముంబై: దేశీయ్ నాలగవ అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీస్ క్వార్టర్ 3లో మెరుగైన ఫలితాలను సాధించింది. నికర లాభాల్లో 7.8 శాతం పెరుగుదలను నమోదు చేసింది. డిసెంబర్ తో ముగిసిన మూడవ త్రైమాసికంలో రూ. 2,070 కోట్ల లాభాలను సాధించింది. గత ఏడాది లాభాలు రూ.1,920కోట్లగా ఉంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఆదాయం 14.2 శాతం పెరిగి రూ.11,814 కోట్లను ఆర్జించింది. గత ఏడాది ఇదే క్వార్టర్ లో ఇది రూ.10,341కోట్లగా ఉంది. డాలర్ రూపంలో నికర లాభాలు 5.2 శాతం వృద్ధిని నమోదు చేసి 306 మిలియన్ డాలర్లను రిపోర్ట్ చేసింది. డాలర్ ఆదాయం 11.4శాతం ఎగిసి 1.74 బిలియన్ డార్లను ఆర్జించింది. అలాగే షేర్ కు 6 బోనస్ ప్రకటించింది. నోయిడా ఆధారిత హెచ్ సీఎల్ ఆర్థిక ఫలితాల్లో మార్కెట్ అంచనాలను బీట్ చేసింది.
2017 ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే ఫలితాలను అంచనావే స్తున్నట్టు హెచ్ సీఎల్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్, సీఈవో సి.విజయ్ కుమార్ తెలిపారు. హెచ్సిఎల్ టెక్ అన్ని రెవెన్యూ విభాగాల్లో విస్తృత వృద్దిని నమోదు చేసినట్టు తెలిపారు. డిసెంబరు త్రైమాసికంలో రూ 2,214.5 కోట్ల నగదు సమానత వచ్చిందన్నారు. అమెరికా, యూరప్ ఆదాయం వరుసగా 13.6 శాతం 17.6 శాతంగాఉంది.
కాగా 8,467 మంది అదనంగా చేరగా... 2016 డిసెంబర్ నాటికి మొత్తం సిబ్బంది సంఖ్య 1,11,092. ఉద్యోగుల వలన 17.9 వద్ద నిలిచింది. మార్కెట్ ఆరంభంలో 2.37 శాతానికిపై గా నష్టపోయిన హెచ్ సీఎల్ షేరు నష్టాలను తగ్గించుకొంది.