రాడ్లు, ఇటుకలతో పిచ్చిపిచ్చిగా కొట్టుకున్నారు
ముజఫర్ నగర్: ఉత్తరప్రదేశ్లో ఖైదీలు తన్నుకున్నారు. ముజఫర్ నగర్ జైల్లో రెండు గ్రూపుల మధ్య పాత కక్షల నేపథ్యంలో గొడవ జరిగి జైలు అధికారుల ముందే చిత్తుచిత్తుగా కొట్టుకున్నారు. ఈ క్రమంలో పదిమంది గాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తొలుత ఆ రెండు గ్రూపుల్లో ఒకరు పాత కక్షకు సంబంధించిన విషయాన్ని లేవనెత్తారు.
దాంతో అవతలి వర్గం కోపంతో ఊగిపోయారు. అసమయంలోనే రెండు వర్గాల మధ్య తొలుత ఇటుకలతో దాడులు జరిగాయి. అనంతరం రాడ్లు తీసుకొని ఫైట్ చేశారు. దీంతో అదనపు పోలీసులు కూడా అక్కడికి వచ్చి వారిని విడగొట్టారు. అనంతరం జైలు భద్రతను పెంచారు. జిల్లా మేజిస్ట్రేట్ కూడా జైలుకు వచ్చి పరిస్థితిని సమీక్షించి సమాచారం సేకరించుకొని వెళ్లారు.