River Management Board
-
ఇక బోర్డుల వంతు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల పరిధిపై సబ్‌కమిటీ స్థాయి భేటీలో ఏమీ తేలలేదు. బోర్డు పరిధిలో ఉండాల్సిన ప్రాజెక్టులపై ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం ఉంది. దీంతో తదుపరి నిర్ణయాలు పూర్తిస్థాయి బోర్డుల్లోనే తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే గోదావరి బోర్డు, మంగళవారం జరిగే కృష్ణా బోర్డు భేటీలు కీలకంగా మారాయి. ప్రాజెక్టుల అంశంతో పాటు సిబ్బంది నియామకం, నిధుల చెల్లింపు అం శాలపై వరుసగా జరగనున్న భేటీల్లోనే స్పష్టత రా నుంది. ఇక్కడ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగానే అక్టోబర్ 14 నుంచి గెజిట్ అమలు జరగనుంది. గెజిట్ అమలుపై చర్చించేందుకు ఆదివారం ఉదయం జలసౌధలో గోదావరి బోర్డు సభ్య కార్యదర్శి బీపీ పాండే అధ్యక్షతన, మధ్యాహ్నం కృష్ణా బోర్డు తరఫున రవికుమార్ పిళ్లై అధ్యక్షతన భేటీలు జరగ్గా, తెలంగాణ తరఫున సీనియర్ ఇంజనీర్లు సుబ్రహ్మణ్య ప్రసాద్, విజయ్‌కుమార్, శ్రీధర్ తదితరులు హాజరయ్యారు. ఒక్కో భేటీ సుమారు మూడు గంటలకుపైగా జరగ్గా, బోర్డు అధీనంలో ఉండాల్సిన ప్రాజెక్టులు, సిబ్బంది, ఇతర రాష్ట్రాల అభ్యంతరాలు, బోర్డు అభిప్రాయాలు, నిధుల చెల్లింపు తదితర అంశాలపై చర్చలు జరిగాయి. గోదావరి ఒక్కటే.. మిగతా వాటికి ఒప్పుకోం.. ఇక గోదావరి బోర్డు భేటీలో ప్రధానంగా ప్రాజెక్టుల పరిధిపై చర్చ జరిగింది. తెలంగాణ ముందు నుంచి చెబుతున్నట్లుగా రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న పెద్దవాగును మాత్రమే బోర్డు పరిధిలో ఉంచాలని కోరింది. అయితే ఏపీ మాత్రం శ్రీరాంసాగర్ నుంచి సీతమ్మసాగర్ బ్యారేజీ వరకు ఉన్న అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోనే ఉంచాలని విన్నవించింది. దీనికి తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై పూర్తిస్థాయి భేటీలో చర్చిద్దామంటూ బోర్డు సర్దిచెప్పింది. ఇక పెద్దవాగు కింద 80% ఆయకట్టు ఏపీ పరిధిలో ఉన్నందున దాని నిర్వహణకయ్యే వ్యయంలో 80% ఏపీనే భరించాలని కోరగా, దీనికి సానుకూలత లభించినట్లు తెలిసింది. మిగతా నిధు లు, సిబ్బంది, వాటికిచ్చే ప్రత్యేక ప్రోత్సాహకాలపై సోమవారం జరిగే బోర్డు భేటీలో స్పష్టత రానుంది. విద్యుదుత్పత్తి కేంద్రాలపై తెలంగాణ అభ్యంతరం కృష్ణా బేసిన్లో జూరాల నుంచి పులిచింతల వరకు ఉన్న అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలో ఉంచాలన్న ప్రతిపాదనలపై ఇరురాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వచ్చినట్లు తెలుస్తోంది. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం, సాగర్, పులిచింతల విద్యుత్కేంద్రాలు బోర్డుల పరిధిలో అక్కర్లే దని తెలంగాణ చెప్పినట్లు సమాచారం. జూరాల ప్రాజెక్టును సైతం బోర్డు పరిధిలోకి తేవడాన్ని తెలంగాణ తప్పుపట్టింది. శ్రీశైలం మీద ఆధార పడి ఉండే కల్వకుర్తి, నాగార్జునసాగర్ హెడ్ రెగ్యులేటర్, ఎడమ కాల్వ హెడ్‌రెగ్యులేటర్, సాగర్ పరిధిలోని వరద కాల్వ, ఆర్డీఎస్, దాని పరిధిలోని తుమ్మిళ్ల, సిద్ధనాపూర్ కాల్వ, ఆర్డీఎస్ హెడ్రెగ్యులేటర్లనే బోర్డు ఆధీనంలో ఉంచేందుకు సంసిద్ధత తెలిపినట్లు సమాచారం. ఇక ఏపీ బనకచర్లతోపాటు దానికింద ఉన్న ఔట్లెట్లు మినహా శ్రీశైలం పరిధిలోని హెచ్ఎన్ఎస్ఎస్, ముచ్చుమర్రి, హెడ్ రెగ్యులేటర్లు, పవర్‌హౌస్, పోతిరెడ్డిపాడు, సాగర్ కింది కుడి కాల్వ, పులిచింతలను బోర్డు పరిధిలో ఉంచేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఏపీ అధికారులు తెలంగాణ పవర్‌హౌస్‌లు తీసుకోవాల్సిందేనని గట్టిగా పట్టు బట్టినట్లు తెలిసింది. ప్రాజెక్టులపై ఒక్కో రాష్ట్రానిది ఒక్కో అభిప్రాయం కావడంతో బోర్డుల భేటీల్లో ఖరారు చేయాలని నిర్ణయించారు. -
నిధులెలా?
కార్యాలయాలు, సిబ్బంది, నిధులపైనే చర్చ కృష్ణా, గోదావరి బోర్డుల స్వరూపంపై మంతనాలు హాజరైన ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు దేశంలోని మిగతా బోర్డుల స్వరూపం పరిశీలన హైదరాబాద్/ న్యూఢిల్లీ: దేశంలో పనిచేస్తున్న నదీ యాజమాన్య బోర్డుల తరహాలోనే కృష్ణా, గోదావరి బోర్డుల స్వరూపం ఉంటే బాగుంటుందనే అభిప్రాయం కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో వ్యక్తమైంది. రెండు బోర్డుల కార్యాలయాల ఏర్పాటుకయ్యే ఖర్చును కేంద్రంతో పాటు రెండు రాష్ట్రాలు భరించాలని, సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన తీసుకోవాలని, నిధుల సమస్య రాని విధంగా తగిన ఏర్పాట్లు ఉండాలని పలువురు ఇంజనీర్లు సూచించారు. బోర్డుల స్వరూపం, పాలనకు సంబంధించిన విధివిధానాలను నిర్ణయించే కసరత్తులో భాగంగా సీడబ్ల్యూసీ శుక్రవారం ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశంలో వివిధ నదీ యాజమాన్య బోర్డుల్లో పనిచేసిన అనుభవం ఉన్న ఇంజనీర్లతో పాటు ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ వెంకటేశ్వరరావు, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ పాల్గొన్నారు. సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలను అధికారులు ‘సాక్షి’కి చెప్పారు. ముఖ్యాంశాలు ఇవీ.. కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్ రాజధానిలో, గోదావరి బోర్డు హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కొత్త రాజధానిలో కార్యకలాపాలు ప్రారంభమయ్యేవరకు.. రెండు బోర్డులు హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయవచ్చు. రెండు బోర్డులు ఒకే ప్రాంగణంలో ఉండటం మంచిది. రెండు బోర్డుల్లోనూ సభ్యులుగా ఉన్న అధికారులు ఉన్నారు. ప్రారంభంలో సిబ్బంది కొరతను అధిగమించడానికి రెండు బోర్డులకు ఉమ్మడిగా సిబ్బందిని నియమించుకోవచ్చు. రెండు బోర్డులను బూర్గుల రామకృష్ణారావు భవన్లో ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ తెలిపింది. జలసౌధలో ఏర్పాటు చేస్తే అనువుగా ఉంటుందని తెలంగాణ చెప్పింది. రెండు బోర్డుల్లోనూ సిబ్బంది శాశ్వత ప్రాతిపదికన తీసుకోవడం మంచిది. అయితే బోర్డుల పరిధిలోని ప్రాజెక్టులను నిర్ధారించి నోటిఫై చేయకుండా.. బోర్డులో పనిభారం ఎంత ఉంటుందనే అంశాన్ని నిర్ధారించలేమని, ఫలితంగా ఎంతమంది సిబ్బంది కావాలనే విషయంలో నిర్ణయానికి రాలేమని ఇరు రాష్ట్రాలు చెప్పాయి. సిబ్బంది సంఖ్యను నిర్ధారించిన తర్వాతే బోర్డు నిర్వహణ ఖర్చుపై తుది అంచనాకు రావచ్చని తెలిపాయి . బోర్డుల నిర్వహణకు అవసరమైన నిధులు సమకూర్చుకొనే విధానం మీద సుదీర్ఘ చర్చ జరిగింది. ముందుగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూర్చిన తర్వాత కేంద్రం రీయింబర్స్మెంట్ చేయాలా? కేంద్రం, రాష్ట్రాల వాటా తేలిన తర్వాత ఎవరి వాటా మేరకు నిధులను సమకూర్చాలా? అనే విషయం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముందుగా నిర్ధారించిన మేరకు నిధులు విడుదల చేయడంలో సిబ్బందికి జీతాల చెల్లింపు సమస్య రాకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు అవసరమనే అభిప్రాయాన్ని సమావేశంలో పాల్గొన్న నిపుణుల్లో దాదాపు అందరూ వ్యక్తం చేశారు. సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన తీసుకోవాలని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతమందిని తీసుకోవాలి? రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎంతమందిని తీసుకోవాలి? ఏ క్యాడర్ వారిని తీసుకోవాలి? బోర్డుల్లో పనిచేయడానికి అవసరమైన మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావడానికి ఆసక్తి చూపించకపోతే ఏం చేయాలి? ఏ స్థాయిలో డిప్యుటేషన్లను అనుమతించాలి? డిప్యుటేషన్లకు అనుమతి ఉంటే.. రెండు రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది సీనియారిటీ దెబ్బతినకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇతర బోర్డుల్లో తలెల్తిన సమ్యలేమిటి?.. ఈ అంశాలపై చర్చ జరిగింది. బోర్డు నివేదికలు కాలపరిమితి (పీరియాడిసిటీ) ఎలా ఉండాలనే అంశం మీదా చర్చ జరిగింది. త్రైమాసిక, అర్ధ సంవత్సరం, వార్షిక నివేదికలు.. ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. బోర్డు సభ్యులతోపాటు బోర్డు చైర్మన్‌కి సైతం ఓటింగ్ హక్కు ఉండాలని సూచించారు. పాలనా నిబంధనలు కేంద్ర ప్రభుత్వ తరహాలోనే ఉండాలని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. డిప్యుటేషన్ మీద తీసుకొనే వారికి కేంద్ర ప్రభుత్వ సర్వీసులోకి వెళ్లినట్లుగా భావించాలని సూచించారు. అదే సమయంలో సీనియారిటీ, పదోన్నతుల్లో ప్రతికూల ప్రభావం లేకుండా నిబంధనలు రూపొందించాలనే అభిప్రాయం వ్యక్తమయింది.గ