rizwana
-
Vizag: ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేసిన ఆటోడ్రైవర్.. 24 గంటల్లోనే
కోవెలకుంట్ల(నంద్యాల)/తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర) : ఇద్దరు పిల్లలను ఆటోడ్రైవర్ కిడ్నాప్ చేసి తీసుకెళుతుండగా పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. బుధవారం కోవెలకుంట్ల సీఐ నారాయణరెడ్డి అందించిన సమాచారం మేరకు.. పట్టణంలోని నాగులకట్ట సమీపంలో నివాసముంటున్న షేక్ మహమ్మద్, షమీవున్ దంపతులకు షేక్ రిజ్వానా, షేక్ ఆసియా సంతానం. పెద్ద కుమార్తె స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి, చిన్న కుమార్తె ఇదే పట్టణంలోని గాంధీ సెంటర్ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నారు. పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో పిల్లలు పట్టణంలోని సెయింట్ జోసఫ్స్ పాఠశాలలో కబడ్డీ నేర్చుకునేందుకు వెళుతున్నారు. కోవెలకుంట్లకు చెందిన ఇమాంఉసేన్ పిల్లలను ఆటోలో ఎక్కించుకుని రోజూ పాఠశాల వద్ద వదిలేవాడు. మంగళవారం ఉదయం పిల్లలను ఆటోలో పంపించి తల్లిదండ్రులు పనుల నిమిత్తం వెళ్లిపోయారు. అయితే అతను పిల్లలను స్కూల్ వద్ద దించకుండా మాయమాటలు చెప్పి ఆటోను నంద్యాల వైపు మళ్లించాడు. నంద్యాలలో దిగి పిల్లలతో సహా గుంటూరు రైలెక్కాడు. రాత్రి అయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది పట్టణంలోని పలు ప్రాంతాల్లో గాలించారు. ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆటో డ్రైవర్ సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా వైజాగ్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని చిన్నారులను రక్షించారు. కోవెలకుంట్ల ఎస్ఐ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బృందాలు అక్కడకు చేరుకోగా రైల్వేపోలీసులు పిల్లలను వారికి అప్పగించారు. ఆటో డ్రైవర్ చిన్నారులను ఎత్తుకెళ్లి విక్రయించేందుకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది. చిన్నారుల కిడ్నాప్ మిస్టరీని పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. -
పెళ్లికి ముందే ప్రేమాయణం.. నాతో కాకుండా నీ భర్తతో ఉంటావా..
సాక్షి, పులివెందుల: పులివెందుల పట్టణంలోని మెయిన్ రోడ్డులో బుధవారం ఉదయం రిజ్వానా (28) అనే వివాహిత దారుణ హత్యకు గురైంది. ప్రియుడే ఆ మహిళ పాలిట కాలయముడయ్యాడు. అక్రమ సంబంధమే హత్యకు కారణమైంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పులివెందుల పట్టణంలోని మెయిన్ రోడ్డులోని రమణారెడ్డి ఎలక్ట్రికల్ షాపు పై అంతస్తులో పగడిపాలెం సర్దార్, రిజ్వానా నివాసం ఉంటున్నారు. రిజ్వానా పెళ్లికాకముందే మరో వ్యక్తితో ప్రేమాయాణం కొనసాగించగా.. ఐదేళ్ల క్రితం సింహాద్రిపురానికి చెందిన పగిడిపాలెం సర్దార్కు ఆమెను ఇచ్చి వివాహం చేశారు. చదవండి: (ఎస్సై నిర్వాకం: ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. పెళ్లాడాడు.. చివరకు) వీరి జీవితం సజావుగా సాగింది. 3 నెలల కిందట రిజ్వానా కుమారుడితో కలిసి ప్రియుడు హర్షవర్థన్‌తో వెళ్లిపోయింది. దీనిపై అప్పట్లో భర్త సర్దార్ భార్య కనిపించలేదని ఫిర్యాదు చేశాడు. హర్షవర్ధన్ తల్లిదండ్రులు కూడా మా కుమారుడు కనిపించలేదని ఫిర్యాదు చేశాడు. అనంతపురం జిల్లా కదిరి పోలీసులు రెండు రోజుల తర్వాత హర్షవర్ధన్, రిజ్వానాలను కనిపెట్టి పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. అప్పట్లో పోలీస్‌స్టేషన్‌లో పెద్ద మనుషుల సమక్షంలో రిజ్వానా తనకు భర్త కావాలని చెప్పింది. దీంతో భార్యభర్తలు పట్టణంలోని రమణారెడ్డి ఎలక్ట్రికల్ షాపు పైఅంతస్తులో నివసిస్తున్నారు. చదవండి: (ప్రియునికి ప్రియురాలి తండ్రి షరతు.. లాడ్జ్‌లో రూం తీసుకొని..) వారం రోజుల క్రితం హర్షవర్ధన్ రిజ్వానాకు ఫోన్ చేసి తన వద్ద ఉండకుండా భర్త వద్ద ఉంటావా.. నిన్ను చంపేస్తానాంటూ బెదిరిస్తుండేవాడు. ఈ క్రమంలో బుధవారం సర్దార్ వెల్డింగ్ వర్క్‌కు వెళ్లాడు. రిజ్వానా తల్లితో కలిసి రమణారెడ్డి ఎలక్ట్రికల్ షాపులో ఉండగా హర్షవర్ధన్ కత్తితో పొడిచాడు. దీంతో రిజ్వానా అక్కడికక్కడే మృతి చెందింది. హర్షవర్ధన్ పారిపోతుండగా రమణారెడ్డి షెట్టర్ వేసి అతన్ని షాపులో ఉంచి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ భాస్కర్‌రెడ్డి, ఏఎస్ఐ చంద్రశేఖర్ నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రమణారెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతురాలికి భర్త సర్దార్, కుమార్తె, కుమారుడు ఉన్నారు. సర్దార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అత్తింటి వేధింపులు తాళలేక
గుంతకల్లు : పెళ్లై ఏడు నెలలు గడువక ముందే ఆమెకు అత్తింటి ఆరళ్లు మొదలయ్యాయి. అదనపు కట్నం తేవాలని భర్త, అత్తమామలు వేధించడంతో ఆమె ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. గుంతకల్లు టూటౌన్ పోలీసులు, బాధిత మహిళ తల్లి ఖాతీజాబీ, అన్న షేక్షావలి తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రాయలచెరువుకు చెందిన ఖాతీజాబీ కుమార్తె రిజ్వానాను ఏడు నెలల క్రితం గుంతకల్లు కోళ్లఫారానికి చెందిన షేక్షావలి, మాబూన్నీల దంపతుల కుమారుడు ఖాయ్యూంకు ఇచ్చి వివాహం చేశారు. వివాహ సమయంలో ఖాయ్యూం కుటుంబ సభ్యులు కోరిన మేరకు రూ.2.70 లక్షలు, 12 తులాల బంగారం కట్న కానుకలు ఇచ్చారు. ఖాయ్యూం దుస్తుల వ్యాపారి. రెండు మాసాలపాటు వీరి సంసారం సాఫీగా సాగింది. అనంతరం అదనపు కట్నం తేవాలంటూ భర్త, అత్తమామలు రిజ్వానాను తరచూ వేధించేవారు. ఈ క్రమంలో చాలాసార్లు ఆమెపై వీరు దాడిచేశారు. ఏమీ చేయలేని రిజ్వానా విషయాన్ని తల్లి, అన్నతో ఫోన్లో చెప్పుకుని బాధపడుతుండేది. వారి వేధింపులు అధికం కావడంతో మంగళవారం సాయంత్రం ఇంట్లో తన బెడ్రూంలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బంధువులు ఎంతపిలిచినా సమాధానం రాకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు బద్దలుకొట్టారు. అప్పటికే ఆమె ఫ్యానుకు వేలాడుతూ కన్పించింది. విషయం తెలుసుకున్న అర్బన్ సీఐ ప్రసాద్‌రావు, టూటౌన్ ఎస్ఐ వలీబాషా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రిజ్వానా బంధువులు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. భర్త వేధింపులు తాళలేక.. అనంతపురం సెంట్రల్ : ఉన్నత చదువు..గౌరవప్రదమైన ప్రభుత్వ ఉద్యోగం అతడిది. భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయినా మగ పిల్లాడు కావాలంటూ నిత్యం భార్యను వేధించేవాడు. భర్త వేధింపులు భరించలేక ఆ ఇల్లాలు బలవన్మరణానికి పాల్పడి తనువు చాలించింది. నగరంలో నాల్గవరోడ్డులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. ట్రాన్స్‌కో డిపార్ట్మెంట్లో ఏఈగా పని చేస్తున్న హనుమంతు నగరంలో నాల్గవరోడ్డులో నివాసముంటున్నాడు. హనుమంతుకు ఎనిమిదేళ్ల క్రితం బొజ్జమ్మ(30)వివాహమైంది. వీరికి దివ్య(4), లక్ష్మి(2) సంతానం. అయితే మగపిల్లాడు జన్మించలేదనే కారణంతో నిత్యం హనుమంతు భార్యతో గొడవపడేవాడు. ఈ కారణంగా వారి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. వేధింపులు అధికం కావడంతో మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బొజ్జమ్మ చీరతో ఇంటి పైకప్పుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు త్రీటౌన్ సీఐ వెంకటేశులు తెలిపారు.