Rohini Carta
-
రోహిణి భగభగలు అంతంతే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చిత్రమైన వాతావరణ పరిస్థితి కొనసాగుతోంది. పగలంతా ఎండలు మండిపోతుండగా, రాత్రికి మాత్రం కాస్త చల్లని వాతావరణం నెలకొంటోంది. సాధారణంగా రోహిణి కార్తెలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. దీనికి తోడు తీవ్రమైన ఉక్కపోత చిరాకు కలిగిస్తుంటుంది. అయితే ప్రస్తుతం రోహిణి కార్తె ప్రవేశించి 5 రోజులు కావస్తున్నా ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణానికి కాస్త అటుఇటుగానే నమోదవుతున్నాయి. రోహిణి కార్తెలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ అధికంగా..అంటే 43 నుంచి 46 డిగ్రీల మధ్య నమోదవుతాయి. కానీ ఈసారి కాస్త తక్కువగా నమోదవుతుండటం గమనార్హం. బుధవారం రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే..అత్యధికంగా ఆదిలాబాద్‌లో 44.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రెండు మూడు చోట్ల 43కు అటుఇటుగానే నమోదు కాగా మిగతా ప్రాంతాల్లో తక్కువ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. హనుమకొండ, నల్లగొండ, నిజామాబాద్, రామగుండం ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదు అయ్యాయి. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా తక్కువగానే నమోదవుతుండటం గమనార్హం. రోహిణి కార్తెలో సాధారణంగా 30 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావాల్సి ఉండగా చాలా ప్రాంతాల్లో తక్కువగా 25, 26, 27 డిగ్రీల మేరకే నమోదు అవుతున్నాయి. బుధవారం కనిష్టంగా నల్లగొండలో 25.0 డిగ్రీ సెల్సీయస్ నమోదైంది. వాతావరణంలో నెలకొన్న మార్పుల ప్రభావంతోనే గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే రానున్న రెండ్రోజులు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇలావుండగా రాష్ట్రంలో అత్యధికంగా మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో 46.4 డిగ్రీ సెల్సీయస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం, బెల్లంపల్లిలో 45.8, ఆసిఫాబాద్‌లో 45.2 డిగ్రీ సెల్సీయస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేడు కేరళను తాకనున్న నైరుతి బంగాళాఖాతంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించిన రుతుపవనాలు గురువారం కేరళను తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాల విస్తరణకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు తెలిపింది. కేరళను తాకిన వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కు విస్తరించి ఆ తర్వాత తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వివరించింది. -
భానుడి ప్రతాపంతో ప్రజలు బెంబేలు
సాక్షి, హైదరాబాద్: భానుడి ప్రకోపానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు విలవిలలాడుతున్నారు. రోహిణి కార్తె నేపథ్యంలో ఎండలు, వేడి గాలులు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. రాష్ట్రంలో రానున్న మూడు రోజులు తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని పేర్కొంది. ఆదిలాబాద్, నల్లగొండ, నిజామాబాద్, హన్మకొండ జిల్లాల్లో అత్యధికంగా 46 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. మెదక్‌లో 45 డిగ్రీలు, రామగుండంలో 45, ఖమ్మంలో 44, భద్రాచలంలో 42, హైదరాబాద్‌లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గర్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. వడదెబ్బకు 35 మంది మృతి రాష్ట్రంలో వడదెబ్బకు బుధవారం 35 మంది మృతి చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 21 మంది, కరీంనగర్ జిల్లాలో 8 మంది, ఖమ్మం జిల్లాలో నలుగురు, రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. -
నిప్పుల కొలిమి
పాలకొల్లు, న్యూస్‌లైన్ : రోహిణీ కార్తె నిజంగానే రోళ్లు పగులగొడుతోంది. గడచిన వారంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు తగ్గినా వడగాలుల తీవ్రత భారీగా పెరిగింది. జిల్లాలో ఈనెల 23న భీమవరంలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదే రోజున తాడేపల్లిగూడెం, తణుకు, కొవ్వూరు పట్టణాల్లో 43 డిగ్రీలు, ఏలూరులో 42.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యూయి. ఈ వేసవిలో ఇవే రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు. శనివారం జిల్లాలో ఎక్కడచూసినా 40 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యూయి. తీవ్రత మాత్రం 41నుంచి 47 డిగ్రీలను తలపించింది. పాలకొల్లులో కేవలం 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, తీవ్రత 47 డిగ్రీలుగా అనిపించిందని వాతావరణ సంస్థలు పేర్కొన్నాయి. జిల్లాలో ప్రతిచోటా ఇదే పరిస్థితి కనిపించింది. ఆదివారం నుంచి మూడు రోజులపాటు ఉష్ణోగ్రతలు, తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఎండ బాబోయ్.. ఎండ రోహిణీ కార్తె ఈనెల 25న ప్రారంభమైంది. మొదట్లో రెండు రోజులపాటు దాని ప్రభావం జిల్లాలో పెద్దగా కనిపించలేదు. నాలుగు రోజుల నుంచి రోహిణీ తీవ్రత పెరుగుతోంది. ఎండలు, వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీనికితోడు వేళాపాళా లేని విద్యుత్ కోతలతో అన్నివయసుల వారు బెంబేలెత్తిపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్న వారి పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. రోహిణికార్తె ప్రవేశానికి ముందు వర్షం కురవడంతో మొదటి రెండు రోజులు అకాశం కొంతమేరకు మేఘావృతమై చల్లటి వాతావరణం నెలకొంది. నాలుగు రోజులనుంచి ఎండ తీవ్రత అధికమై ఉదయం 9 గంటల నుంచే వడగాలులు వడగాలులు వీస్తున్నా యి. మధ్యాహ్నం 12 గంటల తరువాత షాపులన్నీ మూతపడుతున్నాయి. సాయంత్రం 5 గంటల తరువాత వాటిని తెరుస్తున్నారు. వడ దెబ్బకు వృద్ధుడి మృతి ఉండి : వడదెబ్బకు గురై ఉండిలో ఓ వృద్ధుడు మృత్యువాత పడ్డాడు. పడవలరేవు ప్రాంతానికి చెందిన బొబ్బాది సత్యనారాయణ (65) శనివారం మధ్యాహ్నం వడదెబ్బకు గురయ్యూడు. కొద్దిసేపటికే ప్రాణాలు విడిచాడని అతని బంధువులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. జాగ్రత్త వహించండి : కలెక్టర్ ఏలూరు : రానున్న మూడు రోజుల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుం దంటూ వాతావరణ శాఖ హెచ్చరి కలు జారీ చేసిందని కలెక్టర్ సిద్ధార్థజైన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దృష్ట్యా జిల్లా ప్రజలంతా జాగ్రత్త వహించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఎం డలో తిరగవద్దని, పిల్లలు, వృద్ధులు, బాలింతలు బయటకు రాకుండా చూడాలని పేర్కొన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధం చేసి అవసరమైన వారికి తక్షణమే అందించేవిధంగా వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించామని కలెక్టర్ తెలిపారు.