నిప్పుల కొలిమి
పాలకొల్లు, న్యూస్‌లైన్ : రోహిణీ కార్తె నిజంగానే రోళ్లు పగులగొడుతోంది. గడచిన వారంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు తగ్గినా వడగాలుల తీవ్రత భారీగా పెరిగింది. జిల్లాలో ఈనెల 23న భీమవరంలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదే రోజున తాడేపల్లిగూడెం, తణుకు, కొవ్వూరు పట్టణాల్లో 43 డిగ్రీలు, ఏలూరులో 42.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యూయి. ఈ వేసవిలో ఇవే రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు. శనివారం జిల్లాలో ఎక్కడచూసినా 40 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యూయి. తీవ్రత మాత్రం 41నుంచి 47 డిగ్రీలను తలపించింది. పాలకొల్లులో కేవలం 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, తీవ్రత 47 డిగ్రీలుగా అనిపించిందని వాతావరణ సంస్థలు పేర్కొన్నాయి. జిల్లాలో ప్రతిచోటా ఇదే పరిస్థితి కనిపించింది. ఆదివారం నుంచి మూడు రోజులపాటు ఉష్ణోగ్రతలు, తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ఎండ బాబోయ్.. ఎండ
రోహిణీ కార్తె ఈనెల 25న ప్రారంభమైంది. మొదట్లో రెండు రోజులపాటు దాని ప్రభావం జిల్లాలో పెద్దగా కనిపించలేదు. నాలుగు రోజుల నుంచి రోహిణీ తీవ్రత పెరుగుతోంది. ఎండలు, వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీనికితోడు వేళాపాళా లేని విద్యుత్ కోతలతో అన్నివయసుల వారు బెంబేలెత్తిపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్న వారి పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. రోహిణికార్తె ప్రవేశానికి ముందు వర్షం కురవడంతో మొదటి రెండు రోజులు అకాశం కొంతమేరకు మేఘావృతమై చల్లటి వాతావరణం నెలకొంది. నాలుగు రోజులనుంచి ఎండ తీవ్రత అధికమై ఉదయం 9 గంటల నుంచే వడగాలులు వడగాలులు వీస్తున్నా యి. మధ్యాహ్నం 12 గంటల తరువాత షాపులన్నీ మూతపడుతున్నాయి. సాయంత్రం 5 గంటల తరువాత వాటిని తెరుస్తున్నారు.
వడ దెబ్బకు వృద్ధుడి మృతి
ఉండి : వడదెబ్బకు గురై ఉండిలో ఓ వృద్ధుడు మృత్యువాత పడ్డాడు. పడవలరేవు ప్రాంతానికి చెందిన బొబ్బాది సత్యనారాయణ (65) శనివారం మధ్యాహ్నం వడదెబ్బకు గురయ్యూడు. కొద్దిసేపటికే ప్రాణాలు విడిచాడని అతని బంధువులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
జాగ్రత్త వహించండి : కలెక్టర్
ఏలూరు : రానున్న మూడు రోజుల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుం దంటూ వాతావరణ శాఖ హెచ్చరి కలు జారీ చేసిందని కలెక్టర్ సిద్ధార్థజైన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దృష్ట్యా జిల్లా ప్రజలంతా జాగ్రత్త వహించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఎం డలో తిరగవద్దని, పిల్లలు, వృద్ధులు, బాలింతలు బయటకు రాకుండా చూడాలని పేర్కొన్నారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను సిద్ధం చేసి అవసరమైన వారికి తక్షణమే అందించేవిధంగా వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించామని కలెక్టర్ తెలిపారు.