ఢిల్లీకి చేరుకున్న హెచ్సీయూ విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: రోహిత్ మృతి ఘటనపై విద్యార్థులు ఈ నెల 23న తలపెట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమానికి హెచ్సీయూ విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్, మధ్యప్రదేశ్లోని బేతూల్ ప్రాంతాల్లో విద్యార్థులకు పలు ప్రజా సంఘాలు స్వాగతం పలికాయి.
23న ఆందోళన కార్యక్రమం, 24న ఇండియాగేట్ వద్ద నిర్వహించే కొవ్వొత్తుల ర్యాలీలో దేశవ్యాప్తంగా విద్యార్థులు పాల్గొంటారని హెచ్సీయూ జేఏసీ నాయకులు తెలిపారు. ఈనెల 25న భారత్ బంద్కు పిలుపునిచ్చినట్లు వెల్లడించారు. ఢిల్లీలోని జేఎన్యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ విడుదల కోసం చేస్తున్న ఆందోళనల్లో కూడా తాము పాల్గొంటామని తెలిపారు.