కోస్తా తీరంలో నేడు 'కుండపోత'
విశాఖపట్నం: ఓడ రేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. రాత్రి పుదుచ్ఛేరికి సమీపంలోని కడలూరు వద్ద వాయుగుండం తీరం దాటడంతో నేడు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా తెలంగాణలో మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సముద్రంలోకి వెళ్లవద్దంటూ మత్యకారులకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతానికి గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తూ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలుపడుతున్నాయి. మరోపక్క, ఈ వర్షాల కారణంగా తమిళనాడులో ఆరుగురు చనిపోయనట్లు అధికారులు తెలిపారు.