Royal Sundaram Insurance
-
వాహన ఇన్సూరెన్స్ చేయిస్తున్నారా? వీటితో భలే బెనిఫిట్స్!
హైదరాబాద్: రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ పరిశ్రమలోనే మొదటిసారిగా వాహన బీమాకు సంబంధించి మూడు యాడాన్ కవర్లను ప్రవేశపెట్టింది. ప్రైవేటు కార్లకు ‘స్మార్ట్ సేవ్’ పేరుతో యాడాన్ కవరేజీని విడుదల చేసింది. రోడ్‌సైడ్ అసిస్టెన్స్, రిటర్న్ టు ఇన్వాయిస్ పేరుతో ద్విచక్ర వాహనాలకు రెండు కవర్లను తీసుకొచ్చింది. ఇదీ చదవండి: హోం లోన్ వద్దు.. పర్సనల్ లోనే కావాలి! స్మార్ట్సేవ్ అనే ఉచిత యాడాన్ కవర్ కింద కార్లను యజమానులు రాయల్ సుందరం గుర్తించిన ట్రస్టెడ్ రిపేర్ షాపులు, గ్యారేజీల్లో సర్వీస్ చేయించినట్టయితే, ఓన్ డ్యామేజ్ కవర్ ప్రీమియంలో తగ్గింపు లభిస్తుంది. ద్విచక్ర వాహనం ఏదైనా కారణం వల్ల మార్గమధ్యంలో కదల్లేని స్థితిలోకి వెళితే రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కింద సాయాన్ని పొందొచ్చు. రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్లో వాహనానికి నష్టం జరిగితే పూర్తి విలువ మేర చెల్లింపులు ఉంటాయి. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
రాయల్ సుందరంలో ఏజీస్‌కు వాటా!
చెన్నై: సుందరం ఫైనాన్స్ సంస్థ, సాధారణ బీమా కంపెనీ రాయల్ సుందరంలో తనకున్న 75.90 శాతం వాటా నుంచి 25.90% వాటాను ఏజీస్ ఇంటర్నేషనల్ సంస్థకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకుంది.ఈ డీల్ విలువ రూ.1,520 కోట్లు. విక్రయం తర్వాత కూడా రాయల్ సుందరంలో సుందరం ఫైనాన్స్‌కు 50% వాటా ఉంటుంది. ఈ డీల్ ఐఆర్డీఏ తదితర సంస్థల అనుమతులపై ఆధారపడి ఉంటుందని, 2019 తొలి క్వార్టర్లో డీల్ పూర్తి కావచ్చని సుందరం ఫైనాన్స్ ప్రకటించింది. రాయల్ సుందరం ప్రధానంగా మోటార్, హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలో బలంగా ఉంది. 5,600 మంది ఏజెంట్లతో పాటు, 700 శాఖలున్నాయి. 2018 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం రూపంలో రూ.2,643 కోట్లు ఆదాయాన్ని, పన్ను అనంతరం రూ.83 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ప్రీమియం ఆదాయంలో 19%, నికర లాభంలో 56% చొప్పున వృద్ధి నమోదయ్యాయి. తదుపరి దశ వృద్ధి కోసం ఏజీస్‌తో జత కట్టామని సుందరం ఫైనాన్స్ ఎండీ టీటీ శ్రీనివాసరాఘవన్ తెలిపారు. ఏజీస్‌కు ఉన్న అంతర్జాతీయ అనుభవం తమకు విలువైన ఆస్తిగా అభివర్ణించారు. ఆసియాలో స్థానిక భాగస్వామ్యాలు, జాయింట్ వెంచర్ల ద్వారా ఏజీస్ అనుసరించే భిన్న విధానం రాయల్ సుందరంకు గణనీయమైన విలువను తెచ్చిపెడుతుందని రాఘవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, రానున్న ఏళ్లలో గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్న భారత బీమా రంగ మార్కెట్ తమకు గొప్ప అవకాశాలు కల్పిస్తోందని ఏజీస్ సీఈవో బార్ట్‌దే స్మెట్ పేర్కొన్నారు. -
భారత్‌కు బ్రిటన్ బీమా గ్రూప్ ఆర్ఎస్ఏ గుడ్‌బై
- రాయల్ సుందరం ఇన్సూరెన్స్‌లో 26 శాతం వాటాల విక్రయం - డీల్ విలువ రూ. 450 కోట్లు చెన్నై: బీమా సంస్థ రాయల్ సుందరం అలయన్స్‌లో తమకున్న 26 శాతం వాటాలను విక్రయించాలని బ్రిటన్‌కు చెందిన ఆర్ఎస్ఏ గ్రూప్ నిర్ణయించింది. తద్వారా భారత మార్కెట్ నుంచి వైదొలగనుంది. ఈ డీల్ విలువ రూ. 450 కోట్లు. ఆరు నెలల్లో ఈ ఒప్పంద ప్రక్రియ పూర్తి కాగలదని అంచనా. ఒకవైపు బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని పెంచుతూ ప్రభుత్వం ఆర్డినెన్సు తీసుకువచ్చిన తరుణంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాయల్ సుందరం అలయన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ.. ఇకపై సుందరం ఫైనాన్స్‌కి పూర్తి అనుబంధ సంస్థగా మారుతుంది. 2000లో బీమా రంగంలో ప్రైవేట్ సంస్థలకు కూడా అనుమతినిచ్చినప్పుడు మొట్టమొదటిగా లెసైన్సు పొందిన సంస్థ రాయల్ సుందరం అలయన్స్. ప్రస్తుతం వాహన, వైద్య, వ్యక్తిగత ప్రమాద బీమా, ట్రావెల్ తదితర బీమా పాలసీలు అందిస్తోంది. ఆర్ఎస్ఏ భాగస్వామ్యంతో గత 15 సంవత్సరాలుగా బీమా రంగంలో ప్రత్యేక గుర్తింపు దక్కించుకోగలిగినట్లు సుందరం ఫైనాన్స్ ఎండీ టీటీ శ్రీనివాసరాఘవన్ తెలిపారు. కీలకమైన మార్కెట్లపై మరింతగా దృష్టి పెట్టే దిశగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఆర్ఎస్ఏ గ్రూప్ సీఈవో స్టీఫెన్ హెస్టర్ పేర్కొన్నారు.