టపాసు చిన్నదే... సౌండ్ పెద్దది
‘క్షణం’ సినిమా చిన్న టపాసులాంటిది. కానీ, బాక్సాఫీస్ దగ్గర పెద్ద సౌండే చేసింది. దాదాపు రెండు కోట్ల రూపాయలతో తీసిన ఈ సినిమా సుమారు రూ.15 కోట్లు (అన్నీ కలుపుకొని) వసూలు చేసింది. ఆ తర్వాత వచ్చిన చిన్న టపాసు ‘పెళ్లి చూపులు’. దాదాపు రూ.1.60 కోట్లతో తీసిన ఈ సినిమా సుమారు రూ.20 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత బోల్డన్ని చిన్న సినిమాలు మొదలయ్యాయి.