ఫెడరల్ బ్యాంక్ లాభం రూ. 210 కోట్లు
న్యూఢిల్లీ: పెట్టుబడులపై మంచి రాబడులు, వడ్డీ ఆదాయం పెరుగుదల ఊతంతో ప్రైవేట్ రంగ ఫెడరల్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.210 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన రూ. 167 కోట్లతో పోలిస్తే ఇది 26 శాతం వృద్ధి. క్యూ1లో బ్యాంకు ఆదాయం రూ. 2,264 కోట్ల నుంచి రూ. 2,653 కోట్లకు పెరిగింది. ఇక, జూన్ త్రైమాసికంలో స్థూల నిరర్ధక ఆస్తులు(జీఎన్‌పీఏ) 2.92% నుంచి 2.42%కి, నికర ఎన్పీఏలు 1.68% నుంచి 1.39%కి తగ్గాయి. బుధవారం బీఎస్ఈలో ఫెడరల్ బ్యాంక్ షేరు సుమారు 4% క్షీణించి రూ. 114.80 వద్ద ముగిసింది.