ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్6 ధర రూ.4వేలే!
గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్లతో వినియోగదారుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ సేల్‌లో ఐఫోన్6ను కేవలం 4వేల రూపాయలకే విక్రయిస్తుందట. నేటితో ఈ సేల్ ముగియనుంది. రూ.36,990గా ఉన్న ఈ ఫోన్ కేవలం నాలుగువేల రూపాయలకి రావడమేమిటా అనుకుంటున్నారా? ఎలా వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరే చూడండి.. రిపబ్లిక్ డే సేల్ కింద ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఆపిల్ ఐఫోన్6 16జీబీ ధర రూ.27,990. ఒరిజినల్ ధరకు ఇది 24 శాతం డిస్కౌంట్.
అంతేకాక వొడాఫోన్తో 1జీబీ రీఛార్జ్ చేసుకుంటే అందనంగా 9జీబీ డేటాను ఇది ఆఫర్ చేస్తోంది. ఒకవేళ పాత ఐఫోన్ 6ఎస్ ప్లస్‌తో దీన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలని భావించారో, వారికి ఏకంగా 24వేల రూపాయల డిస్కౌంట్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. దీంతో ఫైనాల్గా కొత్త ఐఫోన్ 6 రూ.4040కే వినియోగదారుడి చేతికి వచ్చేస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం పాత ఐఫోన్ 6ఎస్ ప్లస్‌ను కొత్త ఐఫోన్6తో మార్చుకోవాలనుకుంటున్న వారు ఫ్లిప్‌కార్ట్‌లో కొనేసేయండి.