Rs. 9
-
సంగీత ప్రియులకు ఇంటెక్స్ కొత్త ఫోన్
సంగీత ప్రియుల కోసం ఇంటెక్స్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ఇంటెక్స్ ఆక్వా మ్యూజిక్ పేరుతో రూ.9,137కు ఈ ఫోన్‌ను శుక్రవారం భారత మార్కెట్లోకి కంపెనీ విడుదల చేసింది. డ్యుయల్ స్పీకర్స్ ఈ ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ ఫోన్ ద్వారా ఉన్నతమైన సంగీత అనుభవాన్ని కస్టమర్లకు అందిస్తామని కంపెనీ చెబుతోంది. 21 భారత భాషలను సపోర్టు చేసేలా ఇంటెక్స్ ఆక్వా మ్యూజిన్ను రూపొందించారు. ప్రీలోడెడ్‌గా వివిధ యాప్స్‌ను ఇంటెక్స్ దీనిలో పొందుపరిచింది. ఈ ఫోన్ ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండు స్టోర్లలో అందుబాటులో ఉంచనున్నట్టు కంపెనీ పేర్కొంది. ఇంటెక్స్ ఆక్వా మ్యూజిక్ ఫీచర్లు.. 5.5 అంగుళాల హెచ్డీ(720x1280 పిక్సెల్స్) డిస్ప్లే 1.3గిగా హెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో 4జీ సపోర్టు 2 జీబీ ర్యామ్ 16 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ 32 జీబీ వరకు విస్తరణ మెమరీ 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా డ్యుయల్ సిమ్ 3400 ఎంఏహెచ్ బ్యాటరీ గ్రే, సిల్వర్ కలర్స్‌లో ఈ ఫోన్ లభ్యం -
బడ్జెట్ లో లావా కొత్త ట్యాబ్
బడ్జెట్ ధరలతో మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరిస్తున్న లావా, బడ్జెట్ లో తన సరికొత్త టాబ్లెట్ ను దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. తాజాగా లావా ఎక్స్80 పేరుతో ప్రవేశపెట్టిన ఈ టాబ్లెట్ ధరను రూ.9,999గా నిర్ణయించింది. టాబ్లెట్ పోర్ట్ ఫోలియోను విస్తరించే నేపథ్యంలో 3జీ వాయిస్ కాలింగ్ సదుపాయంతో ఈ టాబ్లెట్ ను కంపెనీ ప్రవేశపెట్టింది. భారత్ లోని అన్నిరిటైల్ అవుట్ లెట్లలో ఈ టాబ్లెట్ ను అందుబాటులో ఉంచుతున్నట్టు కంపెనీ ప్రకటించింది. తెలుపు, నలుపు రంగు ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. డివైజ్ కు ఏడాది వారెంటీ, ఇన్-బాక్స్ యాక్సెసరీస్ కు ఆరు నెలల వారెంటీతో లాలా ఈ ట్యాబ్ ను ప్రవేశపెట్టింది. లావా ఎక్స్80 ట్యాబ్ ఫీచర్లు... 8 అంగుళాల ఐపీఎస్ విత్ ఓజీఎస్ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 4.4 కిట్ కాట్ వెర్షన్ 1.3జీహెచ్ జడ్ క్వాడ్ కోర్ ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్ 1జీబీ ర్యామ్ 16జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ 32జీబీ విస్తరణ మెమరీ 5ఎంపీ వెనుక కెమెరా 3.2ఎంపీ ముందు కెమెరా 4200ఎంఏహెచ్ బ్యాటరీ 4జీ ఎల్టీఈ సపోర్టు వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ 2.0 320 గ్రాముల బరువు -
ఆసుస్ జెన్ ఫోన్ మ్యాక్స్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్
తైవాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీ ఆసుస్, జెన్ ఫోన్ మ్యాక్స్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి ను విడుదల చేసింది. రెండు మెమెరీ ఆప్షన్లు, ఇన్ బిల్డ్ స్టోరేజ్ పెంచుకునేలా, ఆక్టా కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 615ఎస్ఓసీ తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. 2జీబీ ర్యామ్, 3 జీబీ ర్యామ్ రెండు వేరియంట్లను కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. 2జీబీ ర్యామ్ ఫోన్ ధర రూ.9,999గా, 3జీబీ ర్యామ్ ధర రూ.12,999గా కంపెనీ ప్రకటించింది. 32జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ ను ఈ వేరియంట్లు కలిగిఉన్నాయి. ఈ కొత్త జెన్ ఫోన్ మ్యాక్స్ వేరియంట్లు ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మాలోతో పనిచేయనున్నాయి. రెండు కలర్లు బ్లూ, ఆరెంజ్ ల్లో ఈ ఫోన్లు లభ్యంకానున్నాయని, 2జీబీ ర్యామ్ వేరియంట్ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది. 3జీబీ ర్యామ్ వేరియంట్ త్వరలోనే అమ్మకానికి వస్తుందన్నారు. క్వాడ్ కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 401ఎస్ఓసీతో జెన్ ఫోన్ మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ ను మొదట జనవరిలో మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. అప్పట్లో 16జీబీ స్టోరేజ్ తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ధరను రూ.8,999కి తగ్గించి కంపెనీ ఇప్పటికీ ఒరిజినల్ జెన్ ఫోన్ మ్యాక్స్ ను ఆన్ లైన్ లో అమ్మకాలు చేపడుతోంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఈ ఫోన్ ప్రత్యేకత. ఈ హ్యాండ్ సెట్ నుంచి బ్యాటరీని బయటికి తీయలేం. 5.5 అంగుళాల హెచ్ డీ ఐపీఎస్ టీఈటీ డిస్ ప్లే, 64జీబీ వరకూ విస్తరణ మెమెరీ, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాస్ తో 13ఎంపీ రేర్ కెమెరా,5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యూయల్ సిమ్, లేజర్ ఆటోఫోకస్ పీచర్ ఈ ఫోన్ లో ఇతర ప్రత్యేకతలు.