సంగీత ప్రియులకు ఇంటెక్స్ కొత్త ఫోన్ | Intex Aqua Music With Android 6.0 Marshmallow, Dual Speakers Launched at Rs. 9,317 | Sakshi
Sakshi News home page

సంగీత ప్రియులకు ఇంటెక్స్ కొత్త ఫోన్

Published Sat, Aug 13 2016 12:02 PM | Last Updated on Sat, Aug 18 2018 4:44 PM

సంగీత ప్రియులకు ఇంటెక్స్ కొత్త ఫోన్ - Sakshi

సంగీత ప్రియులకు ఇంటెక్స్ కొత్త ఫోన్

సంగీత ప్రియుల కోసం ఇంటెక్స్ నుంచి కొత్త స్మార్ట్ఫోన్ వచ్చేసింది. ఇంటెక్స్ ఆక్వా మ్యూజిక్ పేరుతో రూ.9,137కు ఈ ఫోన్ను శుక్రవారం భారత మార్కెట్లోకి కంపెనీ విడుదల చేసింది. డ్యుయల్ స్పీకర్స్ ఈ ఫోన్కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ ఫోన్ ద్వారా ఉన్నతమైన సంగీత అనుభవాన్ని కస్టమర్లకు అందిస్తామని కంపెనీ చెబుతోంది. 21 భారత భాషలను సపోర్టు చేసేలా ఇంటెక్స్ ఆక్వా మ్యూజిన్ను రూపొందించారు. ప్రీలోడెడ్గా వివిధ యాప్స్ను ఇంటెక్స్ దీనిలో పొందుపరిచింది. ఈ ఫోన్ ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు స్టోర్లలో అందుబాటులో ఉంచనున్నట్టు కంపెనీ పేర్కొంది.


ఇంటెక్స్ ఆక్వా మ్యూజిక్ ఫీచర్లు..
5.5 అంగుళాల హెచ్డీ(720x1280 పిక్సెల్స్) డిస్ప్లే
1.3గిగా హెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో
4జీ సపోర్టు
2 జీబీ ర్యామ్
16 జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్
32 జీబీ వరకు విస్తరణ మెమరీ
13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
డ్యుయల్ సిమ్
3400 ఎంఏహెచ్ బ్యాటరీ
గ్రే, సిల్వర్ కలర్స్లో ఈ ఫోన్ లభ్యం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement