
బడ్జెట్ లో లావా కొత్త ట్యాబ్
బడ్జెట్ ధరలతో మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరిస్తున్న లావా, బడ్జెట్ లో తన సరికొత్త టాబ్లెట్ ను దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. తాజాగా లావా ఎక్స్80 పేరుతో ప్రవేశపెట్టిన ఈ టాబ్లెట్ ధరను రూ.9,999గా నిర్ణయించింది. టాబ్లెట్ పోర్ట్ ఫోలియోను విస్తరించే నేపథ్యంలో 3జీ వాయిస్ కాలింగ్ సదుపాయంతో ఈ టాబ్లెట్ ను కంపెనీ ప్రవేశపెట్టింది. భారత్ లోని అన్నిరిటైల్ అవుట్ లెట్లలో ఈ టాబ్లెట్ ను అందుబాటులో ఉంచుతున్నట్టు కంపెనీ ప్రకటించింది. తెలుపు, నలుపు రంగు ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. డివైజ్ కు ఏడాది వారెంటీ, ఇన్-బాక్స్ యాక్సెసరీస్ కు ఆరు నెలల వారెంటీతో లాలా ఈ ట్యాబ్ ను ప్రవేశపెట్టింది.
లావా ఎక్స్80 ట్యాబ్ ఫీచర్లు...
8 అంగుళాల ఐపీఎస్ విత్ ఓజీఎస్ డిస్ ప్లే
ఆండ్రాయిడ్ 4.4 కిట్ కాట్ వెర్షన్
1.3జీహెచ్ జడ్ క్వాడ్ కోర్ ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్
1జీబీ ర్యామ్
16జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్
32జీబీ విస్తరణ మెమరీ
5ఎంపీ వెనుక కెమెరా
3.2ఎంపీ ముందు కెమెరా
4200ఎంఏహెచ్ బ్యాటరీ
4జీ ఎల్టీఈ సపోర్టు
వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ 2.0
320 గ్రాముల బరువు