రూ. 20 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
పూతలపట్టు: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. మండలంలోని కానిపాకం సర్కిల్ వద్ద చేపట్టిన దాడుల్లో ఓ వాహనంలో తరలిస్తున్న ఎర్ర చందనం దుంగలను గుర్తించారు. దీంతో ఆ వాహనాన్ని వెంబడించగా అందులో ఉన్న దుంగలను వదిలి దుండగులు పరారయ్యారు. వాహనంలో ఉన్న 13 దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారూ రూ. 20 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.