జీహెచ్ఎంసీకి భారీగా ఆదాయం
హైదరాబాద్: రద్దైన అధిక విలువ గల నోట్లతో జీహెచ్ఎంసీ భారీగా లాభపడింది. బకాయిలు, సాధారణ బిల్లులను పాత నోట్లతో చెల్లించొచ్చని జీహెచ్ఎంసీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో జీహెచ్ఎంసీ బిల్లులు చెల్లించేందుకు నగర వాసులు క్యూ కట్టారు. గురువారం పాత నోట్లతో జీహెచ్ఎంసీ బిల్లులు చెల్లించడానికి చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివెళ్లారు.
పెద్ద నోట్లు రద్దైన నాటి నుంచి జీహెచ్ఎంసీకి రూ.246.14 కోట్ల ఆదాయం రాగా, జలమండలికి రూ.100కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.