9999 @రూ.3.51 లక్షలు
విశాఖపట్నం : వాహనాల ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రవాణాశాఖకు ఆదాయం కలిసి వచ్చింది. శుక్రవారం ఫ్యాన్సీ నంబర్ల సీరీస్ ప్రారంభం కావడంతో రికార్డు ధరలు పలికాయి. ఆయా ఫ్యాన్సీ నంబర్ల కోసం వాహనదారులు పోటీ పడ్డారు. ఫ్యాన్సీ నంబర్లకు ఉన్న డిమాండ్‌ను బట్టి రవాణా అధికారులు షీల్డ్ వేలం నిర్వహించారు.
ఏపీ 31డీఏ 9999 నంబరు అత్యధికంగా రూ.3.51 లక్షల ధర పలికింది. సింగిల్ నంబర్ 1 రూ.1.10 లక్షలు, నంబర్ 7 రూ.90,300, నంబర్ 9 రూ.1.17లక్షల ధరలు పలికాయి. ఫ్యాన్సీ నంబర్ల ద్వారా శుక్రవారం రూ.10.20 లక్షల ఆదాయం లభించినట్లు డీటీసీ వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఇదిలా ఉండగా గతంలో 9999 నంబర్ రూ.2.85 లక్షల ఆదాయం రాబట్టింది. ఈసారి అదే నంబర్ రికార్డు స్థాయిలో రూ.3.51 లక్షల ధర పలికింది.