తుమ్మిళ్ల ఎత్తిపోతలపై సమీక్ష
శాంతినగర్ : వడ్డేపల్లి మండలం తుమ్మిళ్ల వద్ద ఏర్పాటుచేసే ఎత్తిపోతలపై సోమవారం ఆర్డీఎస్ అధికారులతో ఎమ్మెల్యే సంపత్‌కుమార్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీనికి గతంలో రూ.850 కోట్లతో ప్రతిపాదనలు పంపగా నిధుల మంజూరుపై ప్రభుత్వం పునరాలోచిస్తోందన్నారు. తక్షణమే ఆయకట్టు రైతులను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని అధికారులతో ఆరా తీశారు.
ఆర్డీఎస్కు నీరందాలంటే మొదట తనగల సమీపంలోని మల్లమ్మకుంట వద్ద ప్రతిపాదించిన .39 టీఎంసీలతో 475ఎకరాల భూమిని సేకరించాలన్నారు. అక్కడే రిజర్వాయర్ ఏర్పాటుచేసి లింక్ కెనాల్ ద్వారా ఆర్డీఎస్కు నీటిని కలిపితే బాగుంటుందని ఆర్డీఎస్ ఈఈ చిట్టిబాబు, డీఈ శ్రీనివాసులు, ఏఈ శివరాజ్ బదులిచ్చారు. రెండోదశలో జూలెకల్, వల్లూరు రిజర్వాయర్లు నిర్మిస్తే సరిపోతుందన్నారు. ఈ విషయమై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుతో మాట్లాడి వెంటనే నిధులు మంజురుచేసి పనులు మొదలు పెట్టేందుకు కషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.