బ్యాడ్మింటన్‌లో మెరిసిన మరో తెలంగాణ అమ్మాయి
సాక్షి, హైదరాబాద్: మరో తెలంగాణ అమ్మాయి అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో పతకంతో దూసుకొచ్చింది. 16 ఏళ్ల రూహి రాజు డొమినికన్ రిపబ్లిక్ దేశంలో జరిగిన సాంటో డొమింగో ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోరీ్నలో రన్నరప్‌గా నిలిచింది. అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్న రూహి అన్‌సీడెడ్ ప్లేయర్‌గా బరిలోకి దిగింది. ఫైనల్‌దాకా అసాధారణ పోరాటపటిమతో ఆకట్టుకుంది. టాప్ సీడ్ ఫాబియానా సిల్వా (బ్రెజిల్)తో జరిగిన టైటిల్ పోరులో ఆమె పోరాడి ఓడింది.
రూహి 18–21, 21–12, 13–21తో ఫాబియానా చేతిలో పరాజయం పాలైంది. ఈ టోరీ్నలో తెలంగాణ షట్లర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. సీడెడ్ క్రీడాకారిణులను వరుస గేముల్లో కంగుతినిపించింది. క్వార్టర్ ఫైనల్లో ఆమె 21–18, 21–19తో రెండో సీడ్ అలెజాండ్ర సొటొమయోర్ (గ్వాటెమాలా)ను ఓడించింది. సెమీస్‌లో 21–18, 21–11తో మూడో సీడ్ జాక్వెలైన్ లిమా (బ్రెజిల్)ను కంగుతినిపించింది.