the runner-up
-
రన్నరప్ సానియా జంట
సాక్షి, హైదరాబాద్: బీజింగ్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. చైనాలోని బీజింగ్‌లో శనివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సానియా-కారా బ్లాక్ ద్వయం 4-6, 4-6తో హలవకోవా (చెక్ రిపబ్లిక్)-షుయె పెంగ్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయింది. గంటా 28 నిమిషాలపాటు జరిగిన ఈ ఫైనల్లో సానియా జంట తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయింది. మరోవైపు ప్రత్యర్థి జంట సర్వీస్‌ను 10 సార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా కేవలం ఒకసారి మాత్రమే సద్వినియోగం చేసుకుంది. రన్నరప్‌గా నిలిచిన సానియా జోడీకి 1,55,910 డాలర్ల (రూ. 96 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
‘టెక్సాస్’ రన్నరప్ దీపిక
హోస్టన్ (అమెరికా): భారత నంబర్‌వన్ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పళ్లికల్ టెక్సాస్ ఓపెన్ టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈజిప్టు టీనేజ్ సంచలనం, 18 ఏళ్ల నూర్ ఎల్ షెర్బినితో జరిగిన ఫైనల్లో దీపిక 7-11, 11-5, 7-11, 8-11 తేడాతో ఓటమిపాలైంది. టోర్నీ ఆరంభం నుంచి సంచలన విజయాలు సాధిస్తూ, టాప్ సీడ్ లో వీ వర్న్తో సహా ముగ్గురు సీడెడ్ క్రీడాకారిణుల్ని ఇంటిబాట పట్టించిన షెర్బిని.. ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించింది. దీపిక పోరాడినా షెర్బిని దూకుడు ముందు నిలవలేకపోయింది. అయితే 12వ ర్యాంకర్ దీపిక టైటిల్ సాధించలేకపోయినా.. ఫైనల్‌కు చేరడం ద్వారా భారీగా పాయింట్లు సాధించి తిరిగి టాప్-10లో స్థానం సంపాదించుకునే అవకాశాలను సుగమం చేసుకుంది.