Russia Space
-
సుదీర్ఘ అంతరిక్షయాత్ర చేసి సురక్షితంగా భూమికి
మాస్కో: నాసాకు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు, రోస్కోస్మొస్‌కు చెందిన మరో శాస్త్రవేత్త సుదీర్ఘ అంతరిక్ష యాత్రను ముగించుకుని క్షేమంగా భూమికి చేరారు. వీరు ప్రయాణించిన స్పేస్‌క్రాఫ్ట్ సోయుజ్ ఎంఎస్-23 కజకిస్తాన్‌లోని జెజ్‌కజ్‌గాన్ నగరంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. రోస్కోస్మొస్ వ్యోమగాములు సెర్గె ప్రొకొపియేవ్, దిమిత్రి పెటెలిన్ నాసా వ్యోమగామి ఫ్రాన్సిస్ రూబియో సెప్టెంబర్ 21, 2022లో సోయుజ్ ఎంఎస్-23 స్పేస్‌క్రాఫ్ట్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణమయ్యారు. వ్యోమగాములు క్షేమంగా భూమి మీదకు చేరిన విషయాన్ని రోస్కోస్మొస్, నాసా సంస్థలు ధృవీకరించాయి. రష్యా వ్యోమగాములు సెర్గె ప్రొకొపియేవ్, దిమిత్రి పెటెలిన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 370 రోజుల 21 గంటల 22 నిముషాలు గడిపినట్లు ప్రకటించగా నాసా తమ వ్యోమగామి ఫ్రాన్సిస్కో రూబియో 371 రోజుల పాటు అంతరిక్షంలో గడిపినట్లు ఎక్స్(ట్విట్టర్)లో ప్రకటించింది. వాస్తవానికి వీరు ఆరు నెలల క్రితమే భూమికి చేరుకోవాల్సి ఉండగా చిన్న ఉల్క తాకిడికి స్పేస్‌క్రాఫ్ట్‌లో లీక్ చోటుచేసుకోవడంతో అది సాధ్యపడలేదు. సిబ్బంది లేకుండా మాస్కో మరో రాకెట్ పంపడంతో దానిలో ముగ్గురు వ్యోమగాములు తిరుగుప్రయాణమయ్యారు. సెప్టెంబర్ 27, 2023కి భూమికి చేరుకొని కజకిస్తాన్‌లో క్షేమంగా ల్యాండ్ అయ్యారు. #SoyuzMS23Landing@roscosmos cosmonauts and commander of the Soyuz-MS23 spaceship 👨🏻🚀Sergey Prokopyev is out from the spacecraft. pic.twitter.com/vHbeOpSBr4 — The Space Pirate🥷🏻👨🏻🚀 💫🪐🚀 (@TheSpacePirateX) September 27, 2023 🇺🇸🇸🇻 | El astronauta Frank Rubio, estadounidense de origen salvadoreño, se vio obligado a quedarse en órbita debido a una falla en su nave. Ahora, tras 371 días y 5.963 vueltas alrededor de la Tierra, su nave ha aterrizado y reunirá con su familia. pic.twitter.com/VezH1FHdV4 — El Salvador Avanza (@SvAvanza) September 27, 2023 ఇది కూడా చదవండి: USA : ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు -
నాసా సంచలన ప్రకటన.. పుతిన్ ముందస్తు కౌంటర్!
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతున్న వేళ.. రష్యాను ఏకాకిని చేసేందుకు అమెరికా శతవిధాల ప్రయత్నించింది. ఆంక్షల ద్వారా ప్రపంచ దేశాలను మాస్కోకు దూరం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలే చేసింది. అయితే.. ఇప్పుడొక సంచలన నిర్ణయం తీసుకుంది అగ్రరాజ్యం. రష్యాతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి విమానాలను తిరిగి ప్రారంభిస్తామని శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా తాజాగా ఒక ప్రకటన చేసింది. ‘‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నిరంతర సురక్షిత కార్యకలాపాలను నిర్ధారించడానికి, వ్యోమగాముల జీవితాలను పరిరక్షించడానికి.. అంతరిక్షంలో నిరంతరం US ఉనికిని నిర్ధారించడానికి అమెరికా ఈ నిర్ణయం తీసుకుంటోంది. నాసా US క్రూ స్పేస్‌క్రాఫ్ట్-రష్యన్ సోయుజ్‌లో సమీకృత సిబ్బందిని తిరిగి ప్రారంభిస్తుంది అని నాసా ఆ ప్రకటనలో ప్రకటించింది. అయితే.. నాసా ఈ ప్రకటన కంటే ముందే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. రోస్ కాస్మోస్ సంస్థ డైరెక్టర్ దిమిత్రి రోగోజిన్‌ను బాధ్యతల ఆఘమేఘాల మీద తప్పించారు. ఈ మేరకు క్రెమ్లిన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తద్వారా నాసా ప్రకటనకు తాము సానుకూలంగా లేమనే సంకేతాలను ఆయన పంపిచినట్లయ్యింది. #UPDATE Russian President Vladimir Putin has relieved the head of the country's space agency, Dmitry Rogozin, of his duties, according to a decree released by the Kremlin on Friday. 📸 Dmitry Rogozin was appointed in 2018 as the head of Roscosmos. pic.twitter.com/pJpE6V0Aec — AFP News Agency (@AFP) July 15, 2022 నాసా ప్రకటన కంటే ముందే దిమిత్రిని తప్పించడంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. నాసాకు అనుకూలంగా వ్యవహరించాడనే ఆరోపణలపైనే ఆయన్ని తొలగించారా అనే కోణంలోనే పలు అంతర్జాతీయ మీడియా హౌజ్‌లు కథనాలు ప్రచురిస్తున్నాయి. మరోవైపు రష్యాతో కలిసి పని చేయడం తప్ప.. ఐఎస్ఎస్ విషయంలో అమెరికాకు మరో మార్గం లేదా? అని ప్రశ్నిస్తున్నారు పలువురు. -
వ్యోమగాములను తీసుకెళ్లే రాకెట్