వింబుల్డన్ ఫైనల్లో ముగురుజ
లండన్: స్పెయిన్ టెన్నిస్ స్టార్ ముగురుజ రెండో సారి వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. సెమీస్‌లో 64 నిమిషాల పాటు జరిగిన గేమ్‌లో స్లొవేకియా స్టార్ రిబరికోవాను 6-1, 6-1 తేడాతో ముగురుజ చిత్తుగా ఓడించింది. ఏ దశలో రిబరికోవా పోటీని ఇవ్వలేకపోయింది. ఫ్రీక్వార్టర్లో ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ)ని ఓడించి సంచలన విజయం నమోదు చేసిన ముగురుజ అదే ఉత్సాహంతో ఫైనల్‌కు చేరింది.
ఇక ఫైనల్లో ముగురుజ రెండో సెమీస్‌లో తలపడే కోంటా, వీనస్ లలో ఒకరితో పోటీపడనుంది. 2015 వింబుల్డన్ ఫైనల్స్‌కు చేరి సెరినా విలియమ్స్ చేతిలో ఖంగుతిన్నఈ స్పెయిన్ స్టార్ సంచలన విజయంతో మరోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. గతేడాది ఫ్రేంచ్ ఓపెన్ గెలుచుకున్న ముగురుజ వింబుల్డన్ టైటిల్ కొట్టాలని భావిస్తోంది. రెండో సారి వింబుల్డన్ ఫైనల్‌కు వెళ్లిన తొలి స్పెయిన్ స్టార్‌గా ముగురుజ రికార్డు నమోదు చేసింది. అంతకు ముందు స్పెయిన్ స్టార్ సాంచెజ్ వికారియో 1990 వింబుల్డన్ ఫైనల్ చేరింది.