S-Cross
-
కార్ల ధరలు పెంచేసిన మారుతీ సుజుకీ
న్యూఢిల్లీ : దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా ధరల మోత మోగించింది. తన అన్ని మోడల్స్‌పై రూ.8014వరకు ధరలు పెంచుతున్నట్టు శుక్రవారం ప్రకటించింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి రానున్నాయి. ఎక్స్‌షోరూం న్యూఢిల్లీలో తన అన్ని మోడల్స్‌పై రూ.1500 నుంచి రూ.8014 వరకు ధరలు పెంచుతున్నట్టు మారుతీ సుజుకీ ఓ ప్రకటనలో తెలిపింది. కమోడిటీ, ట్రాన్స్‌పోర్టేషన్, అడ్మినిస్ట్రేటివ్ ధరలు పెరగడంతో కార్ల ధరలు పెంచుతున్నట్టు మారుతీసుజుకీ చెప్పింది. హ్యాచ్‌బ్యాక్ ఆల్టో 800 నుంచి ప్రీమియం క్రాస్ఓవర్ ఎస్-క్రాస్ వరకు మోడల్స్‌ను కంపెనీ విక్రయిస్తోంది. వీటి ధరలు ఎక్స్ షోరూం ఢిల్లీలో ప్రస్తుతం రూ.2.45 లక్షల నుంచి రూ.12.03 లక్షల వరకు ఉన్నాయి. గతేడాది ఆగస్టులో ఎంఎస్ఐ తన కాంపాక్ట్ ఎస్యూవీ విటారా బ్రిజాపై రూ.20వేల వరకు ధరలు పెంచింది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బెలానో ధర కూడా రూ.10వేల వరకు పెంచిన సంగతి తెలిసిందే. మిగతా ఎంపికచేసిన మోడల్స్‌పై ధరలు రూ.1500 నుంచి రూ.5000ల వరకు పెంచుతున్నట్టు చెప్పింది. గతేడాదే వివిధ కార్ల కంపెనీలు తమ ఇన్పుట్ ధరలు పెరగడంతో హ్యాందాయ్ మోటార్ ఇండియా, మహింద్రా అండ్ మహింద్రా, టోయోటా, రెనాల్ట్, మెర్సిడెస్-బెంజ్ ఇండియా, టాటా మోటార్స్ ధరలు పెంచుతున్నట్టు ప్రకటించాయి. -
వచ్చే నెల మొదటి వారంలో మారుతి ఎస్-క్రాస్
ముంబై : మారుతి సుజుకీ ప్రీమియం కారు, ఎస్-క్రాస్ వచ్చే నెల మొదటి వారంలో మార్కెట్లోకి రానున్నది. ఎస్-క్రాస్తో ప్రీమియం కార్లనందించడం ప్రారంభిస్తామని మారుతి సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్.ఎస్. కల్సి చెప్పారు. ఇలాంటి ప్రీమియం కార్లను నెక్సా బ్రాండ్ అవుట్లెట్ల ద్వారా విక్రయిస్తామని వివరించారు. ఎస్-క్రాస్ ధర రూ.10 లక్షల వరకూ ఉండొచ్చని అంచనా. -
మారుతీ ‘ఎస్-క్రాస్’ ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం
న్యూఢిల్లీ : మారుతీ సుజుకీ మార్కెట్లోకి తీసుకురానున్న ‘ఎస్-క్రాస్’ మోడల్ ప్రి-లాంచ్ బుకింగ్స్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఎస్-క్రాస్ మోడల్‌ను ఆగస్టుకు ముందుగానే మార్కెట్లోకి తీసుకొస్తామని, వాటిని నెక్సా షోరూమ్‌లలో విక్రయిస్తామని మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది. ఈ మోడల్ ధర రూ.10 లక్షలుగా ఉంటుందని అంచనా. మారుతీ తన ప్రీమియం రేంజ్ కార్లను విక్రయించడానికి నెక్సా షోరూమ్‌లను ఏర్పాటుచేసింది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30 పట్టణాల్లో 100 నెక్సా షోరూమ్‌లను ఏర్పాటుచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.