న్యూఢిల్లీ : మారుతీ సుజుకీ మార్కెట్‌లోకి తీసుకురానున్న ‘ఎస్-క్రాస్’ మోడల్ ప్రి-లాంచ్ బుకింగ్స్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఎస్-క్రాస్ మోడల్‌ను ఆగస్టుకు ముందుగానే మార్కెట్‌లోకి తీసుకొస్తామని, వాటిని నెక్సా షోరూమ్‌లలో విక్రయిస్తామని మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది. ఈ మోడల్ ధర రూ.10 లక్షలుగా ఉంటుందని అంచనా. మారుతీ తన ప్రీమియం రేంజ్ కార్లను విక్రయించడానికి నెక్సా షోరూమ్‌లను ఏర్పాటుచేసింది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30 పట్టణాల్లో 100 నెక్సా షోరూమ్‌లను ఏర్పాటుచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.