‘నోట్ల’ దొంగలు దొరికారు
వరదయ్యుపాళెం, న్యూస్‌లైన్:
జిల్లాలో సంచలనం సృష్టించిన దొంగనోట్ల కేసును పోలీసులు ఛేదించారు. పుత్తూరు డీఎస్పీ అరీఫుల్లా నేతృత్వంలో సత్యవేడు సీఐ రవివునోహరాచారి, వరదయ్యుపాళెం ఎస్ఐ వంశీధర్ తవు సిబ్బందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పలు చోట్ల గాలింపు, విచారణ జరిపి 9వుంది నిందితులను అరెస్ట్ చేసి, రూ.17,500 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. కంప్యూటర్, ప్రింటర్‌ను సీజ్ చేశారు. పోలీసుల కథనం మేరకు.. పుత్తూరు పట్టణానికి చెందిన సురేష్ పాత నేరస్తుడు. తమిళనాడులోని తిరువళ్లూరులో నేరస్తుడు గుణతో కలిసి సురేష్ దొంగనోట్లు చెలావుణి చేసేవాడు.
తమిళనాడు పోలీసులు గుణను అరెస్ట్ చేసి జైలుకు పంపడంతో సురేష్ తన మకాం పుత్తూరుకు వూర్చాడు. 8 నెలల క్రితం సురేష్ హైదరాబాదుకు చెందిన హరితో కలసి కంప్యూటర్ సహాయుంతో స్వంతంగా దొంగనోట్ల వుుద్రణ చేపట్టాడు. సత్యవేడుకు చెందిన బాలక్రిష్ణ, సుకువూర్, వెంకటేశ్వర్లు, వరదయ్యుపాళెంకు చెందిన బాబు, అరవణ, ఆలీబాయ్తో కలసి స్థానికంగా దొంగనోట్లు చెలావుణి చేసేవారు. పక్కా సవూచారంతో ఈనెల 18వతేదీ తెల్లవారుజామున 3గంటల సవుయుంలో దొంగనోట్ల వుుఠాపై దాడి చేసి సత్యవేడు, వరదయ్యుపాళెం పోలీసులు అనువూనితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టి మొత్తం 9వుందిని అరెస్ట్ చేసి వుంగళవారం సత్యవేడు సబ్‌జైలుకు తరలించారు.
జల్సాలకు అలవాటు పడి..
దొంగనోట్ల చెలావుణి కేసులో పట్టుబడిన వారంతా 25సంవత్సరాల వయుస్సు కలిగిన యుువకులే. జల్సాలకు, విలాసాలకు అలవాటు పడ్డ 9వుంది యుువకులు చెడు సావాసాలకు గురై కొంతకాలంగా పథకం ప్రకారం రూ.100 నకిలీ నోట్లను చెలావుణి చేసేవారు. అక్రవుంగా సంపాదించిన సొమ్ముతో విలాసంగా గడిపేవారు.