Saajiv
-
17వ శతాబ్దపు పండగ..
... చేసుకోబోతున్నారు మమ్ముట్టి. ఆ పండగ పేరు ‘మామాక్కమ్’. ఈ పండగ ఇప్పుడు తెరపైకి రానుంది. 17వ శతాబ్దానికి చెందిన ఈ పండగతో సినిమా తీయడానికి చిత్రదర్శకుడు సాజీవ్ పిళ్లై 12 ఏళ్ల పాటు పరిశోధన చేశారు. ఈ పండగ విశిష్టత ఏంటంటే... కేరళలో నిలా రివర్ ఉంది. అక్కడ కులశేఖర సామ్రాజ్యం టైమ్‌లో 12 సంత్సరాలకొకసారి ఈ పండగ జరిపేవారు. ఆ సంబరాలను వీక్షించేందుకు విదేశీయులు కూడా వచ్చేవారట. అంతటి ఫేమస్ ఫెస్టివల్ నేటి తరానికి చూపించాలన్నది సాజీవ్ తపన. ఆయన కథ చెప్పగానే మమ్ముట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ‘‘ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నింటిలోకి ఇదే పెద్ద సినిమా. చాలా ఆనందంగా ఉంది’’ అని మమ్ముట్టి పేర్కొన్నారు. సాజీవ్ అనుభవం ఉన్న దర్శకుడు కాదు. ఇదే ఆయనకు తొలి చిత్రం. కానీ, కథ చెప్పిన విధానం చూసి, అద్భుతంగా తెరకెక్కిస్తారని మమ్ముట్టికి నమ్మకం కుదిరి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వేణు కునమ్పిళ్లై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ వర్క్ చేయనున్నారు. ఇంతకీ ఇందులో మమ్ముట్టి క్యారెక్టర్ ఏంటో చెప్పలేదు కదూ? పేరు ‘చావేరుకల్’. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. -
లోకల్ ఆటోలో...
సజీవ్, రాజు, లావాణ్యరావ్, టీనా రాథోడ్ ముఖ్య తారలుగా న్యూ టాలెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నందు జెన్న దర్శకత్వంలో శ్రీసాయి గణేశ్ నిర్మిస్తున్న చిత్రం ‘లోకల్ ఆటో’. మంగళవారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలను వ్యాపారవేత్త ఆంజనేయ రాజు వైష్ణవి రికార్డింగ్ థియేటర్లో నిర్వహించారు. ప్రేమ, మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. నిర్మాత మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు 18 సినిమాలను నిర్మించిన నేను భవిష్యత్‌లో కూడా చిన్న చిత్రాలనే నిర్మించాలనుకుంటున్నాను. వచ్చే నెల 2న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, 25 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘లోకల్ ఆటోలో ఏం జరిగిందనేది ఆసక్తిగా ఉంటుంది. రెండు యువ జంటల మధ్య ఆసక్తికరమైన సంఘటనల నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించనున్నాం’’ అన్నారు నందు జెన్న. ఈ చిత్రానికి సంగీతం: వినయ్ బాలాజీ.