
... చేసుకోబోతున్నారు మమ్ముట్టి. ఆ పండగ పేరు ‘మామాక్కమ్’. ఈ పండగ ఇప్పుడు తెరపైకి రానుంది. 17వ శతాబ్దానికి చెందిన ఈ పండగతో సినిమా తీయడానికి చిత్రదర్శకుడు సాజీవ్ పిళ్లై 12 ఏళ్ల పాటు పరిశోధన చేశారు. ఈ పండగ విశిష్టత ఏంటంటే... కేరళలో నిలా రివర్ ఉంది. అక్కడ కులశేఖర సామ్రాజ్యం టైమ్‌లో 12 సంత్సరాలకొకసారి ఈ పండగ జరిపేవారు. ఆ సంబరాలను వీక్షించేందుకు విదేశీయులు కూడా వచ్చేవారట. అంతటి ఫేమస్ ఫెస్టివల్ నేటి తరానికి చూపించాలన్నది సాజీవ్ తపన. ఆయన కథ చెప్పగానే మమ్ముట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
‘‘ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నింటిలోకి ఇదే పెద్ద సినిమా. చాలా ఆనందంగా ఉంది’’ అని మమ్ముట్టి పేర్కొన్నారు. సాజీవ్ అనుభవం ఉన్న దర్శకుడు కాదు. ఇదే ఆయనకు తొలి చిత్రం. కానీ, కథ చెప్పిన విధానం చూసి, అద్భుతంగా తెరకెక్కిస్తారని మమ్ముట్టికి నమ్మకం కుదిరి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వేణు కునమ్‌పిళ్లై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ వర్క్ చేయనున్నారు. ఇంతకీ ఇందులో మమ్ముట్టి క్యారెక్టర్ ఏంటో చెప్పలేదు కదూ? పేరు ‘చావేరుకల్’. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment