శాకంబరిని దర్శించుకున్నచంద్రబాబు
విజయవాడ: శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాలలో మూడో రోజైన శుక్రవారం దుర్గమ్మను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. పండితులు ఆయనకు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ కూడా అమ్మ వారిని దర్శించుకున్నారు.
కాగా వేలాది మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. మూడు రోజుల పాటు వైభవంగా జరిగిన ఉత్సవాలు శుక్రవారంతో ముగియనున్నాయి. భవానీ దీక్ష మండపంలో నిర్వహించే మహా పూర్ణాహుతితో ఉత్సవాలు లాంఛనంగా ముగుస్తాయి.