శాకంబరిని దర్శించుకున్నచంద్రబాబు | chandrababu visits kanaka durga temple in vijayawada | Sakshi
Sakshi News home page

శాకంబరిని దర్శించుకున్నచంద్రబాబు

Published Fri, Jul 31 2015 10:33 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM

chandrababu visits kanaka durga temple in vijayawada

విజయవాడ: శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాలలో మూడో రోజైన శుక్రవారం దుర్గమ్మను  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. పండితులు ఆయనకు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ కూడా అమ్మ వారిని దర్శించుకున్నారు.

కాగా వేలాది మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. మూడు రోజుల పాటు వైభవంగా జరిగిన ఉత్సవాలు శుక్రవారంతో ముగియనున్నాయి. భవానీ దీక్ష మండపంలో నిర్వహించే మహా పూర్ణాహుతితో ఉత్సవాలు  లాంఛనంగా ముగుస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement