Sadavarti satram (choultry) lands
-
రూ.60.30 కోట్లు పలికిన సదావర్తి భూములు
వ్యూహాత్మకంగా దక్కించుకున్న ప్రొద్దుటూరుకు చెందిన టీడీపీ నేత చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్లోని సదావర్తి సత్రానికి చెందిన చెన్నైలోని 83.11 ఎకరాల భూములకు రెండవసారి నిర్వహించిన వేలంలో రూ.60.30 కోట్ల ధర పలికింది. ప్రభుత్వం సరైన ప్రచారం కల్పించక పోవడం, రిజిస్ట్రేషన్ చేసివ్వబోమంటూ బెదరగొట్టిన నేపథ్యంలో ప్రముఖ బిల్డర్స్ ఎవరూ వేలంలో పాల్గొనలేదు. ఏడాదిన్నర క్రితం ఈ భూములను కేవలం రూ.22.44 కోట్లకు కారుచౌకగా టీడీపీ పెద్దలు కొట్టేయాలనుకున్న విషయం తెలిసిందే. ఈ విషయమై వైఎస్సార్సీపీ పోరాటంతో సుప్రీంకోర్టు, హైకోర్టుల ఆదేశాల మేరకు సోమవారం చెన్నైలోని టీటీడీ సమాచార కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బహిరంగ వేలం ప్రక్రియను నిర్వహించింది. దాదాపు 3 గంటల పాటు సాగిన వేలం ప్రక్రియలో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సత్యనారాయణ బిల్డర్స్ భాగస్వామి బద్వేలు శ్రీనివాసులురెడ్డి వ్యూహాత్మకంగా రూ.60.30 కోట్లకు పాడుకుని భూములు దక్కించుకున్నారు. ఇతను మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డికి అనుచరుడు. వేలం ప్రక్రియలో ఆరు సంస్థలు సీల్డు టెండర్లు దాఖలు చేయగా, రెండు సంస్థలు ఈ టెండర్ల విధానంలో బిడ్లు దాఖలు చేశాయి. వీరితో పాటు మరో ఎనిమిది మంది బిడ్డర్లు నేరుగా బహిరంగ వేలంలో పాల్గొన్నారు. రూ.27.45 కోట్లతో వేలం మొదలు వేలం ప్రక్రియ రూ.27.45 కోట్ల నుంచి మొదలైంది. కనిష్టంగా రూ.5 లక్షల చొప్పున పెరుగుతూ రూ.60.30 కోట్ల వద్ద ముగిసింది. మొత్తం 186 విడతల్లో ధర పెరిగింది. బహిరంగ వేలం అనంతరం సీల్డు కవర్ల రూపంలో దాఖలైన బిడ్లు పరిశీలించగా, అందులో అత్యధికంగా రూ.54.90 కోట్లు కోట్ అయ్యింది. ఆ తర్వాత ఈ టెండరు విధానంలో దాఖలైన రెండు బిడ్లు తెరవగా అత్యధికంగా రూ.28.27 కోట్లు నమోదైంది. దీంతో మూడు విధానాల్లో బహిరంగ వేలంలో సత్యనారాయణ బిల్డర్స్ భాగస్వామి శ్రీనివాసులురెడ్డి రూ.60.30 కోట్లతో మొదటి స్థానంలో, హైదరాబాద్కు చెందిన చదలవాడ లక్ష్మి రూ.60.25 కోట్ల ధరతో రెండో స్థానంలో అత్యధిక ధరతో నిలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఏడాదిన్నర కిత్రం జరిగిన వేలం ప్రక్రియలో కేవలం రూ.22.44 కోట్లతో అత్యధిక బిడ్డరుగా నిలిచిన కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ సహచరుడు సంజీవరెడ్డి రెండో విడత వేలంలో రూ.54.15 కోట్ల వరకు పాడారు. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా వేలం ప్రక్రియలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రూ.43 కోట్ల ధర వరకు భూముల కొనుగోలుకు ఆసక్తి చూపుతూ వేలం ప్రక్రియలో పాల్గొన్నారు. వేలం వివరాలు సుప్రీంకోర్టుకు.. బహిరంగ వేలం వివరాలను ఒక నివేదికగా సుప్రీంకోర్టుకు అందజేయనున్నట్టు దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ ప్రకటించారు. కోర్టు తదుపరి ఉత్తర్వులకు లోబడి అత్యధిక బిడ్డరు వివరాలను ప్రకటిస్తామని తెలియజేశారు. కోర్టు ఉత్తర్వులతో సంబంధం లేకుండా వేలం ప్రక్రియలో అత్యధిక బిడ్డరుగా నిలిచిన వారు నిబంధనలకు అనుగుణంగా 20వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటలోపు పాట ధర మొత్తంలో 50 శాతం అంటే 30.15 కోట్లు చెల్లించాలని స్పష్టం చేశారు. లేని పక్షంలో రూ.60.25 కోట్ల ధరతో రెండో స్థానంలో నిలిచిన చదలవాడ లక్ష్మి అత్యధిక బిడ్డరుగా అర్హత పొందుతారని చెప్పారు. -
రూ.60.30 కోట్లు పలికిన సదావర్తి భూములు
►చంద్రబాబు సర్కార్ కుట్రకు బ్రేక్ ►సదావర్తి భూముల వేలానికి అనూహ్య స్పందన ►అనూహ్య ధర పలిగిన సదావర్తి సత్రం భూములు ►గంటపాటు పోటా పోటీగా సాగిన వేలం పాట ►రూ.60.30 కోట్లకు దక్కించుకున్న సత్యనారాయణ బిల్డర్స్ సాక్షి, అమరావతి : సదావర్తి ట్రస్ట్ భూముల వ్యవహారంలో చంద్రబాబు భాగోతం బట్టబయలైంది. చౌకగా సదావర్తి భూములను తన అనుయాయులకు కట్టబెట్టాలనుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడకు షాక్ తగిలింది. సుమారు గంటపాటు పోటాపోటీగా సాగిన బహిరంగ వేలంలో సదావర్తి సత్రం భూములు మూడింతల ఎక్కువ ధర పలికాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సోమవారం చెన్నైలో నిర్వహించిన వేలం పాటలో...సదావర్తి భూములు ఏకంగా 60 కోట్ల 30 లక్షల ధర పలికాయి. వేలం పాటలో 83.11 ఎకరాల భూమిని కడప జిల్లాకు చెందిన సత్యనారాయణ బిల్డర్స్ వేలం పాటలో దక్కించుకుంది. సత్యనారాయణ బిల్డర్స్ తరఫున ప్రొద్దుటూరు ఆస్పత్రుల అభివృద్ధి కమిటీ ఛైర్మన్ బద్వేలు శ్రీనివాస్ రెడ్డి వేలంలో పాల్గొన్నారు. కాగా, ఆ సంస్థలో ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వరదరాజులరెడ్డి కుమారుడు కొండారెడ్డితో పాటూ పలువురు భాగస్వాములుగా ఉన్నారు. రూ.27కోట్ల 45 లక్షల నుంచి ప్రారంభమైన వేలం పాట ముందు నుంచి పోటాపోటీగా సాగింది. ఈ-టెండర్లలో 54 కోట్లకు బ్రహ్మనంద కోట్ చేశారు. అయితే బహిరంగ వేలంలో మాత్రం 60 కోట్ల 30 లక్షలకు సత్యనారాయణ బిల్డర్స్ దక్కించుకుంది. గతంతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు అంటే...37 కోట్ల 90 లక్షల అధిక ధర పలకడంతో.... చంద్రబాబు ప్రభుత్వానికి చెంప పెట్టుగా మారింది. వేలం పాట ప్రక్రియ మొత్తాన్ని సుప్రీం కోర్టు నివేదిస్తామని దేవదాయ శాఖ కమిషనర్ అనురాధ ప్రకటించారు. చెన్నై టీ నగర్లోని టీటీడీ సమాచార కేంద్రంలో సోమవారం ఉదయం 11 గంటలకు సదావర్తి సత్రం భూముల అమ్మకానికి బహిరంగ వేలం ప్రక్రియ మొదలైంది. ఈ–టెండరు కమ్ సీల్డు కవర్ కమ్ బహిరంగ వేలం పద్ధతిన 83.11 ఎకరాల సత్రం భూముల అమ్మకానికి మళ్లీ వేలం నిర్వహించారు. దేవాదాయశాఖ కమిషనర్ అనురాధ నేతృత్వంలో భూముల వేలం కొనసాగింది. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో బహిరంగ వేలానికి ఎమ్మెల్యే ఆర్కే హాజరు అయ్యారు. ఈ-టెండర్లలో హరి అసోసియేట్ కంపెనీ అర్హత సాధించగా, బి. రామకృష్ణ, ఆళ్ల రామకృష్ణ, శ్రీనివాసరావు, ఆర్ఎస్ఆర్కే కిషోర్, డి.బ్రహ్మానందం, వెంకట జయరామిరెడ్డి టెండర్లు అర్హత పొందాయి. కాగా సదావర్తి సత్రం పేరిట ఉన్న 83.11 ఎకరాల భూముల అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఏడాది మార్చి 28న చెన్నై నగరంలో బహిరంగ వేలం నిర్వహించింది. అప్పుడు జరిగిన వేలం ప్రక్రియ లోపభూయిష్టంగా జరిగిందని, సర్కారు పెద్దలు ఆ భూములు దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) హైకోర్టుకు వెళ్లడంతో ఏడాదిన్నరగా దీనిపై వివాదం కొనసాగుతోంది. అయితే సదావర్తి సత్రం భూములుగా పేర్కొంటున్నవి తమ ఆస్తులని, ఏపీ ప్రభుత్వం నిర్వహించే వేలం ప్రక్రియను నిలుపుదల చేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. గతంలో 83.11 ఎకరాలను రూ.22.40 కోట్లకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వారికి సదావర్తి భూములు కట్టబెట్టిన విషయం విదితమే. తాజా వేలంలో సదావర్తి భూములకు అనూహ్యంగా ధర పెరిగి చంద్రబాబు సర్కార్కు చుక్కెదురు అయినట్లు అయింది. సదవర్తి భూములపై సంబంధిత కథనాలు ఇక్కడ చదవండి మా కళ్లు కప్పొద్దు..! దాచిన భూమి ‘దారి’కొచ్చింది సదావర్తి భూములపై ఏపీ సర్కార్కు ఎదురుదెబ్బ సర్కారుకు శరాఘాతం -
‘ఆ భూములకు రూ.60.30 కోట్లు సమంజసమే’
సాక్షి, చెన్నై: తమ శక్తి మేరకే బహిరంగ వేలంలో పాల్గొన్నామని సదావర్తి సత్రం భూములను దక్కించుకున్న సత్యనారాయణ బిల్డర్స్ తెలిపారు. ఆ భూములకు రూ.60.30 కోట్లు చెల్లించడం సమంజసమేనని అన్నారు. 48 గంటల్లో సగం డబ్బును డిపాజిట్ చేస్తామని పేర్కొన్నారు. అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకున్న తర్వాతే బహిరంగ వేలంలో పాల్గొన్నామని సత్యనారాయణ బిల్డర్స్ అన్నారు. కాగా రెండోసారి జరిగిన వేలంలో అధిక ధర చెల్లించి సదావర్తి భూములను కడపకు చెందిన సత్యనారాయణ బిల్డర్స్ చేజిక్కించుకున్నారు. సదావర్తి భూముల వేలం వివరాలను సుప్రీంకోర్టుకు నివేదిస్తామని ఏపీ దేవాదాయశాఖ కమిషనర్ అనురాధ తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. కాగా గుంటూరు జిల్లా అమరావతిలో రాజా వాసిరెడ్డి వంశీయులు వేద విద్యను అభ్యసించేవారికి చేయూతనందించాలన్న ఉద్దేశంతో సత్రాలు ఏర్పాటు చేశారు. భక్తులు, యాత్రికులు బస చేయడానికి ఇవి ఉపయోగపడ్డాయి. రాజా వాసిరెడ్డి వంశీయులు సేవా నిరతిని మెచ్చిన పలువురు సంపన్నులు సదావర్తి సత్రానికి భారీగా భూములు, నగదు విరాళాలు అందించారు. అందులో భాగంగా ఇప్పటి తమిళనాడులోని మహాబలిపురం రహదారిని ఆనుకుని ఉన్న తాళంబూర్లో సదావర్తి సత్రం కోసం 471 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు. కాల క్రమంలో సత్రం ధర్మకర్తలు 350 ఎకరాల భూమిని వివిధ సందర్భాల్లో విక్రయించారు. మిగిలిన భూమి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయశాఖ స్వాధీనం చేసుకుంది. ఇందులో కబ్జాలు పోనూ 83.11 ఎకరాల భూమి దేవాదాయ శాఖ పరిధిలో ఉంది చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి కాగానే ఈ భూములపై తెలుగు తమ్ముళ్ల కన్ను పడింది. రాజా వారి తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు వెంటనే ఆ 83.11 ఎకరాల భూమిని అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. దానికి ఓ సాకు కూడా వెతుక్కున్నారు. సదావర్తి భూములు అన్యాక్రాంతమైపోతున్నాయని వాటిని విక్రయించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయిస్తూ కేవలం 22కోట్ల రూపాయలకే తమ అనుయాయులకు కట్టబెట్టింది. సదావర్తి భూములపై అసలు నిజాలు బయటకు రావడంతో - చంద్రబాబు ఎదురుదాడికి దిగారు. 5 కోట్లు రూపాయలు ఎక్కువిస్తే భూములను వారికే ఇస్తామంటూ చంద్రబాబు ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రకటన ఆధారంగా మంగళగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే హైకోర్టులో సదావర్తి భూములపై పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... మరోసారి వేలం నిర్వహించాలని ఆదేశించిన విషయం విదితమే. -
మళ్లీ సదావర్తి భూముల వేలం