sagaramala
-
‘కోస్టల్ బెర్త్’లో రూ. 2,302 కోట్ల ప్రాజెక్టులు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక సాగరమాల కింద ‘కోస్టల్ బెర్త్ పథకం’లో రూ. 2,302 కోట్లతో వివిధ ప్రాజెక్టులు చేపట్టనున్నామని కేంద్రం ప్రకటించింది. మొత్తం 47 ప్రాజెక్టులకు గాను మహారాష్ట్రకు 12, ఏపీ, గోవాలకు పదేసి చొప్పున, కర్ణాటక 6, కేరళ, తమిళనాడుకు మూడేసి, గుజరాత్ 2, పశ్చిమ బెంగాల్‌కు ఒక ప్రాజెక్టు కేటాయించామని కేంద్ర నౌకాయాన శాఖ తెలిపింది. ఈ పథకంలో ప్రముఖ ఓడరేవులు, రాష్ట్రాల మారీటైం బోర్డులు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంతవరకూ రూ. 620 కోట్లు మంజూరు చేశామని, మిగతా 24 ప్రాజెక్టులకు అనుమతుల కేటాయింపులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపింది. -
‘సాగరమాల’తో కోటి ఉద్యోగాలు
రూ. 4 లక్షల కోట్ల పెట్టుబడులు: షిప్పింగ్ శాఖ న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన ‘సాగరమాల’ కార్యక్రమం కింద దాదాపు 150 ప్రాజెక్టులను గుర్తించినట్లు కేంద్ర షిప్పింగ్ శాఖ తెలిపింది. వీటికి రూ. 4 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమవుతాయని పేర్కొంది. వీటితో రాబోయే పదేళ్లలో 40 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు సహా మొత్తం కోటిపైగా కొత్త ఉద్యోగాల కల్పన జరగగలదని వివరించింది. దాదాపు 7,500 కిలోమీటర్ల పొడవుండే తీరప్రాంతం, 14,500 కిలోమీటర్ల పైచిలుకు జలరవాణా మార్గాల ఊతంతో పోర్టులను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం సాగరమాల కార్యక్రమాన్ని తలపెట్టింది. దీనికి సంబంధించిన జాతీయ ప్రణాళికలో(ఎన్పీపీ) తీర ప్రాంతమున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి 14 తీరప్రాంత ఆర్థిక మండళ్లు ఏర్పాటు చేయడంవంటి అంశాలను ప్రతిపాదించారు. వీటికి అవసరమైన పెట్టుబడులను ఆకర్షించేలా తొలి మారిటైమ్ ఇండియా సదస్సు 2016లో ఆవిష్కరించనున్నారు. -
'సాగరమాల'లో పాల్గొన్న చంద్రబాబు
న్యూఢిల్లీ : తీర ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'సాగరమాల' ప్రాజెక్టు సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఢిల్లీలో కేంద్ర షిప్పింగ్,రోడ్డు రవాణా,హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. సాగరమాల అపెక్స్ కమిటీకిది మొదటి సమావేశం. కాగా దేశవ్యాప్తంగా కొత్తగా ప్రతిపాదించిన 101 జాతీయ జల రవాణా మార్గాలను అభివృద్ధి చేసేందుకు వీలుగా చట్టం చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. గడిచిన 30 ఏళ్లలో కేవలం ఐదింటిని మాత్రమే జాతీయ జల రవాణా మార్గాలను గుర్తించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ-పుదుచ్చేరి మార్గంలో 1,078 కి.మీ. మేర జల మార్గం ఒకటి. కేంద్రం తాజాగా మరో 101 జాతీయ జల రవాణా మార్గాలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రెండు మార్గాలకు చోటు దక్కింది. కృష్ణా నదిలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మీదుగా ఒక జాతీయ జల మార్గం, మంజీరా నదిలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మీదుగా మరో మార్గాన్ని కేంద్రం అభివృద్ధి చేయనుంది.