భారత్‌తో ఫైనల్‌కు లంక స్పిన్నర్ దూరం.. జట్టులోకి ఆల్‌రౌండర్
Asia Cup 2023- India vs Sri Lanka In Final: ఊహించినట్లుగానే టీమిండియాతో ఫైనల్‌కు ముందు శ్రీలంకకు ఎదురుదెబ్బ తగిలింది. లంక స్టార్ స్పిన్నర్ మహీశ్ తీక్షణ జట్టుకు దూరమయ్యాడు. ఆసియా కప్-2023 సూపర్-4లో పాకిస్తాన్‌తో తాడో పేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్ సందర్భంగా తీక్షణ గాయపడ్డాడు.
ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో తొడ కండరాలు పట్టేసినా బౌలింగ్ కొనసాగించి తన స్పెల్ పూర్తి చేశాడు. మెరుగైన ఎకానమీతో ఒక వికెట్ కూడా తీశాడు. అయితే, స్కానింగ్ అనంతరం గాయం తీవ్రమైనదిగా తేలినట్లు తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు వెల్లడించింది.
ఆసియా కప్-2023 ఫైనల్‌కు అతడు దూరమైనట్లు తెలిపింది. మహీశ్ తీక్షణ స్థానంలో సహన్ అరాచిగేను జట్టులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. తీక్షణను హై పర్ఫామెన్స్ సెంటర్‌కు పంపిస్తున్నట్లు లంక క్రికెట్ బోర్డు తెలిపింది.
ఎవరీ సహన్ అరాచిగే?
27 ఏళ్ల సహన్ అరాచిగే.. బ్యాటింగ్ ఆల్‌రౌండర్. లెఫ్టాండ్ బ్యాటర్ అయిన అతడు.. రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ బౌలర్. జింబాబ్వేలో వన్డే వరల్డ్‌కప్-2023 క్వాలిఫయర్స్ సందర్భంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో లంక తరఫున అరంగేట్రం చేశాడు.
ఫైనల్లో టాప్ స్కోరర్
తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో 5 ఓవర్లు బౌలింగ్ చేసి 18 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అయితే, అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక క్వాలిఫయర్స్ ఫైనల్లో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో మాత్రం అదరగొట్టాడు సహన్.
నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 57 పరుగులతో రాణించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అప్పటికే వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించిన శ్రీలంక టాప్-1లో నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు.
చదవండి: టీమిండియాకు షాక్.. ఫైనల్‌కు ఆల్‌రౌండర్ దూరం! లంకకు యువ క్రికెటర్..