Sahul
-
నాన్నే చంపేశాడు..!
ప్రకాశం, చీమకుర్తి: అంతా అనుకున్నట్లే జరిగింది. కన్న కొడుకు షేక్ సాహుల్ (3)ను తండ్రి షేక్ ఖాదర్‌వలి కిరాతకంగా చంపేశాడు. కత్తితో పీక కోసి డంపింగ్ యార్డులో ఉన్న పెద్ద రాళ్ల మధ్య పూడ్చిపైన గోతాలు, గడ్డితో కప్పేశాడు. చీమకుర్తికి సమీపంలో 10 కిలోమీటర్లు దూరంలో కర్నూల్ రోడ్డుకు దగ్గరలో ఉన్న యల్లయ్యనగర్‌లో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లా ఏఎస్ పేటకు చెందిన షేక్ ఖాదర్‌వలి, సల్మా బేల్దారీ పనుల కోసం నాలుగేళ్ల నుంచి యల్లయ్యనగర్‌లో నివశిస్తున్నారు. దంపతుల మధ్య తరుచూ గోడవల కారణంగా తనను తీసుకెళ్లాలని సల్మా తన అన్నదమ్ములకు సమాచారం అందించింది. ఆమెను నెల్లూరు తీసుకెళ్లేందుకు శుక్రవారం బంధువులు వచ్చారు. ఈ నేపథ్యంలో కొడుకు తనకు పుట్టలేదనే అనుమానం ఉంచుకున్నాడు పెంచుకున్నాడు ఖాదర్‌వలి. అనంతరం కొడుకును బైకుపై ఎక్కించుకొని కొనిపెడతానంటూ బంకుల వద్దకు తీసుకెళ్లాడు. యల్లయ్యనగర్‌కు సమీపంలో ఉన్న ఎర్రకొండ డంపింయ్ యార్డుల వైపు తీసుకెళ్లి కొడుకు పీక అతి దారుణంగా కోసి చంపేశాడు. తర్వాత చుట్టుపక్కల ఉన్న బండలు పైనపెట్టి శవం బయటకు కనిపించకుండా గోతం కప్పి పైన గడ్డి మొక్కలు చల్లేసి ఏమీ తెలియనట్లు తిరిగి ఇంటికి వచ్చాడు. శుక్రవారం సాయంత్రం సాహుల్ కనిపించడం లేదని తండ్రి ఖాదర్‌వలికి బంధువులు చెప్పారు. తనకు తెలియదని, బంకు వద్దకు తీసుకెళ్లి తినుబండారాలు కొనిపెట్టి మళ్లీ ఇంటి వద్దే వదిలి పెట్టానని నమ్మించాడు. అనుమానంతో శుక్రవారం రాత్రి ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. ఈలోపు శనివారం కూడా అదృశ్యమైన సాహుల్ కనిపించకపోవడంతో ఆదివారం పిల్లోడి తండ్రి ఖాదర్‌వలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 9 గంటలకు తన కుమారుడిని చంపేసినట్లు అంగీకరించాడు. మృతదేహాన్ని ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో బయటకు తీశారు. సీఐ దుర్గాప్రసాద్, ఎస్ఐ జీవీ చౌదరి సంఘటన స్థలాన్ని పరిశీలించి హత్యకు కారణాలు సేకరిస్తున్నారు. భార్యపై దాడి కుమారుడి హత్య విషయం వెలుగులోకి రాక ముదు అంటే శనివారం రాత్రి మొత్తం సల్మాను భర్త ఖాదర్‌వలి కొడుతూనే ఉన్నాడు. కుమారుడు ఎక్కడకు వెళ్లింది తల్లి చూసుకోవద్దా.. అంటూ వేధించాడు. కుమారుడిని చంపిన తండ్రిని కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు కోరుతున్నారు. -
ఆ ‘ఇద్దరే’ టార్గెట్ .!
►ఎర్రచందనం అక్రమ రవాణాలో ఇక మిగిలింది అంతర్జాతీయ ప్రధాన స్మగ్లర్ ‘సాహుల్’ ‘ఏటీఎం’లే ►దుబాయ్‌లో కింగ్‌మేకర్‌గా ‘సాహుల్’ ►9 నెలల్లో 26 మందిపై పీడీ యాక్ట్ నమోదు ►వీరంతా ‘ సాహుల్’ అనుచరులే...! కడప అర్బన్: అంతర్జాతీయ స్థాయిలో ఎర్రచందనం స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని శాసిస్తున్న వారిలో ఇక మిగిలింది ఇద్దరే.. ఆ ఇద్దరు చెన్నైకి చెందిన సాహుల్ భాయ్ ఒకరు, పాండిచ్చేరికి చెందిన అహ్మద్ తయ్యుబ్ మొహిద్దీన్ అలియాస్ ఏటీఎం మరొకరు. వీరిద్దరి పేర్లు ప్రస్తుతం పోలీసుల రికార్డుల్లో ఉన్నట్లు సమాచారం. వీరిని అరెస్ట్ చేయగలిగితే అంతర్జాతీయ స్థాయిలో ఎర్ర చందనం అక్రమ రవాణా ప్రక్రియను పూర్తిగా కూకటి వేళ్లతో పెకలించినట్లవుతుందని పలువురు భావిస్తున్నారు. జిల్లా ఎస్పీగా పీహెచ్డీ రామకృష్ణ బాధ్యతలు చేపట్టిన తర్వాత గత ఏడాది ఆగస్టు నుంచి 26 మందిపై పీడీ యాక్ట్‌లను ప్రయోగించారు. వీరంతా సాహుల్ భాయ్ అనుచరులేనని పోలీసులు తమ విచారణలో తేల్చినట్లు సమాచారం. ఎర్రదుంగల అక్రమ రవాణాలో చురుగ్గా ‘ఏటీఎం’ జిల్లా నుంచి ఎర్రచందనం అక్రమ రవాణాను చెన్నై, కోల్‌కత్తాల నుంచి దుబాయ్, ఇతర దేశాలకు చాకచక్యంగా చేయడంలో ఏటీఎం నేర్పరి. పాండిచ్చేరిలో తనకున్న రిసార్ట్స్‌కు వచ్చి వెళుతుంటాడని సమాచారం. సాహుల్కు ఎర్రచందనం అక్రమ రవాణాలో సహకరించడంలో ఏటీఎందే ‘కీలక పాత్ర’. 9 నెలల్లోనే 26 మందిపై పీడీ యాక్ట్‌ల ప్రయోగం: వీరంతా సాహుల్ అనుచరులే..! వైఎస్ఆర్ జిల్లా పోలీసు యంత్రాంగం జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ పర్యవేక్షణలో టాస్క్‌ఫోర్స్, వివిధ పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బంది గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకు 26 మందిపై పీడీ యాక్ట్‌లను ప్రయోగించి కడప కేంద్ర కారాగారంలో ఉంచారు. వీరిలో ప్రధానంగా పార్తిబన్, సుబ్రమణ్యం అలియాస్ సింగపూర్ సుబ్రమణ్యం, జాకీర్, ఫయాజ్ అహ్మద్ అలియాస్ ఫయాజ్‌లతో పాటు ఉన్నవారంతా సాహుల్ భాయ్ అనుచరులేనని పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది. టాస్క్‌ఫోర్స్ టార్గెట్‌లో ‘ఏటీఎం’, సాహుల్’.. జిల్లా పోలీసు యంత్రాంగం ఏటీఎం, సాహుల్లను అరెస్ట్ చేయగలిగితే ఎర్రచందనం అక్రమ రవాణాను కూడా పూర్తిగా నిర్మూలించినట్లేనని అనుకుంటున్నారు. ఇందుకోసం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వారి కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం ముమ్మరంగా చేస్తున్నారు. నిఘా పెంచి వారిని త్వరగా అరెస్ట్ చేస్తే ఎర్రచందనం స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చినట్లే అవుతుందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. దుబాయ్‌లో కింగ్ మేకర్‌గా‘సాహుల్ భాయ్’ ఎర్రచందనం స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో విస్తరింపజేసేందుకు ‘సాహుల్ భాయ్’ దుబాయ్‌ని స్థావరంగా చేసుకున్నాడు. అక్కడ లైసెన్స్డ్ ఫర్నీచర్ షాపును నడుపుతూ తాను సంపాదించిన అక్రమార్జన ద్వారా అక్కడ కింగ్ మేకర్‌గా పేరు తెచ్చుకున్నాడు. తన ప్రధాన అనుచరుడు ఏటీఎం ద్వారా అనేక దేశాలకు సముద్ర మార్గంలో ఎర్రచందనం దుంగలను రవాణా చేస్తూ, వ్యాపారాన్ని యథేచ్ఛగా నిర్వహిస్తున్నాడు. వీరిద్దరూ పోలీసులకు చిక్కితే 100 శాతం ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టినట్లవుతుందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. -
నకిలీ కరెన్సీ నోట్ల ముఠా అరెస్ట్
టీనగర్, న్యూస్‌లైన్: రైలులో 9 లక్షల నకిలీ కరెన్సీనోట్లను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వెస్ట్ బెంగాల్ నుంచి రైలు ద్వారా చెన్నైకు నకిలీ కరెన్సీ నోట్లు తరలిస్తున్నట్లు సీబీసీఐడీ పోలీసులకు సమాచారం అందింది. పోలీసు సూపరింటెండెంట్ పెరుమాల్ పర్యవేక్షణలో డీఎస్పీ రత్నమణి ఆధ్వర్యంలో చెన్నైకు వచ్చే రైళ్లు, రైల్వే స్టేషన్లలో సీబీసీఐడీ పోలీసులు నిఘా పెట్టారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో రైలు నుంచి దిగిన సాహుల్ వ్యాసర్పాడిలోని రఫిక్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లాడు. పోలీసులు అతన్ని వెంబడించి విచారణ చేపట్టగా వెస్ట్ బెంగాల్ నుంచి సాహుల్ నకిలీ కరెన్సీ నోట్లను రైలులో తరలించినట్లు తెలిసింది. రఫిక్ ఆదేశాలతో నకిలీ కరెన్సీ నోట్లను అక్కడ నుంచి సాహుల్ తీసుకువచ్చినట్లు తెలిసింది. వారి వద్ద నుంచి *500, *1000 నకిలీ కరెన్సీ నోట్లు తొమ్మిది లక్షల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి రఫిక్, సాహుల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రఫిక్ ఇది వరకే నకిలీ కరెన్సీనోట్ల కేసులో అరెస్టు అయ్యారు. వెస్ట్ బెంగాల్లో ఎవరి వద్ద నుంచి రఫిక్ నకిలీ కరెన్సీ నోట్లను తీసుకువచ్చారనే విషయంపై పోలీసులు తీవ్రంగా విచారణ జరుపుతున్నారు. అంతేకాకుండా పాకిస్తాన్ తీవ్రవాది జాకీర్ హుసేన్తో ఇతనికి సంబంధాలు ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇద్దరిని పోలీసులు కోర్టులో హాజరు పరిచి జైలులో నిర్బంధించారు. రఫీక్‌ను పోలీసు కస్టడీకి తీసుకునేందుకు పోలీ సులు నిర్ణయించారు.