25 అంబులెన్సులు దానం
ముంబై: మహారాష్ట్రలో వైద్య సేవల నిమిత్తం మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ తనపెద్ద మనసును చాటుకున్నారు. మహారాష్ట్ర మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలను అందించడానికి గాను షిర్డీ శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కు 25 అంబులెన్సులను దానంగా ఇవ్వనున్నారు. తన వ్యక్తిగత హోదాలో ఈ సహాయం చేస్తున్నట్టు చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రకటించారు.
కాగా ట్రస్ట్ ఇటీవల రాష్ట్రంలో సాయి అంబులెన్స్ సేవలను మొదలు పెట్టింది. ఈమేరకురాష్ట్రంలోని కొన్ని స్వచ్ఛంద సంస్థలకు 500 అంబులెన్సులు అందించింది. మారుమూల ప్రాంతాల్లో తక్షణం వైద్య సేవలు అందించడానికి వీలుగా వివిధ సంస్థల నుంచిసిఎస్ఆర్ నిధుల ద్వారా ఒక 'సాయి అంబులెన్స్ పథకం' ప్రారంభించిన సంగతి తెలిసిందే.