25 అంబులెన్సులు దానం | Mahindra to donate 25 ambulances to Saibaba Sansthan Trust | Sakshi
Sakshi News home page

25 అంబులెన్సులు దానం

Published Mon, Dec 26 2016 7:57 PM | Last Updated on Mon, Oct 8 2018 7:58 PM

Mahindra to donate 25 ambulances to Saibaba Sansthan Trust

ముంబై:  మహారాష్ట్రలో  వైద్య సేవల నిమిత్తం  మహీంద్రా అండ్ మహీంద్రా   ఛైర్మన్ తనపెద్ద మనసును చాటుకున్నారు. మహారాష్ట్ర మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలను అందించడానికి  గాను షిర్డీ శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కు 25 అంబులెన్సులను దానంగా ఇవ్వనున్నారు. తన వ్యక్తిగత హోదాలో ఈ సహాయం చేస్తున్నట్టు  చైర్మన్ ఆనంద్ మహీంద్రా   ప్రకటించారు.

కాగా  ట్రస్ట్ ఇటీవల రాష్ట్రంలో సాయి అంబులెన్స్ సేవలను మొదలు పెట్టింది.  ఈమేరకురాష్ట్రంలోని కొన్ని స్వచ్ఛంద సంస్థలకు  500 అంబులెన్సులు అందించింది.  మారుమూల ప్రాంతాల్లో తక్షణం వైద్య సేవలు అందించడానికి వీలుగా వివిధ సంస్థల నుంచిసిఎస్ఆర్ నిధుల ద్వారా ఒక 'సాయి అంబులెన్స్ పథకం' ప్రారంభించిన సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement