జిల్లాస్థాయి సైన్స్కాంగ్రెస్ కరదీపిక ఆవిష్కరణ
విద్యారణ్యపురి : పాఠశాల విద్యాశాఖ, తెలంగాణ రాష్ట్ర సాంకేతిక మండలి సంయుక్తంగా ‘సుస్థిరాభివృద్ధికి విజ్ఞాన శాస్త్రం సాంకేతికత, వినూత్న ఆవిష్కరణలు’ అంశంపై అక్టోబర్లో నిర్వహించే జిల్లాస్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ కరదీపికను డీఈఓ పి.రాజీవ్ హన్మకొండలోని డైట్ కళాశాలలో గురువారం ఆవి Ù్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు ఉన్నత పాఠశాలల బాలబాలికలు రూపొందించే ప్రాజెక్టులను గైడ్ చేసేందుకు ఉపాధ్యాయులకు ఈనెల 23న ఉదయం 10 గంటలకు ములుగు, జనగామ డివిజన్ ఉపాధ్యాయులకు, మధ్యాహ్నం 2 గంటలకు మహబూబాబాద్, వరంగల్ డివిజన్ ఉపాధ్యాయులకు హన్మకొండలోని న్యూసైన్స్ పీజీ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహిస్తామని వివరించారు. ప్రతి ఉన్నత పాఠశాల నుంచి గైడ్ టీచర్ హాజరు కావాలన్నారు. తగిన సూచనలకు జిల్లా కోఆర్డినేటర్ రాంగోపాల్రెడ్డి (94924 47099), అకడమిక్ కోఆర్డినేటర్ గురునాధరావు (98665 49297)ను సంప్రదించాలని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓలు తోట రవీందర్, యాదయ్య, సారంగపాణి అయ్యంగార్, సైన్స్ అధికారి సీహెచ్. కేశవరావు, రిసోర్స్ పర్సన్ కె.రామయ్య పాల్గొన్నారు.