Sajana
-
బిగ్ బాస్ జంట విడాకులు.. వీడియో రిలీజ్ చేసిన నటి!
మలయాళ బిగ్ బాస్ మూడో సీజన్లో ఫేమ్ తెచ్చుకున్న జంట ఫిరోజ్ ఖాన్, సజ్నా ఫిరోజ్. ప్రస్తుతం ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. విడిపోవడానికి కేవలం తన వ్యక్తిగత కారణాలేనని సజ్నా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా తెలిపింది. విడాకుల గురించి తెలిసి.. తన అభిమానులు తన పట్ల పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించింది. (ఇది చదవండి: యానిమల్ సక్సెస్.. క్రేజీ ట్యాగ్ కోల్పోయిన రష్మిక!) సజ్నా వీడియోలో మాట్లాడుతూ..'ఈ విషయం చెప్పాలంటే నాకు చాలా బాధగా ఉంది. మాతో సన్నిహితులు కూడా ఇది ఊహించి ఉండరు. కానీ ఫిరోజ్, నేను విడాకులకు సిద్ధమవుతున్నాం. ఈ విషయాన్ని పరస్పరం అంగీకరించాం. అయితే ఇది పూర్తిగా మా వ్యక్తిగత నిర్ణయమే. ఈ విషయం తెలిసిన కొందరు నాతో అనుచితంగా ప్రవర్తించారు. నా తమ్ముడిగా భావించే వ్యక్తి నుంచే చేదు అనుభవం ఎదురైంది' అని తెలిపింది. అయితే విడిపోయినప్పటికీ మా పిల్లల కోసం మాట్లాడతామని పేర్కొంది. ప్రస్తుతం పిల్లలు మా అమ్మ వద్ద ఉన్నారని.. మేం విడిపోయామన్న విషయం వారికి తెలియదని చెప్పుకొచ్చింది. విడిపోయిన తర్వాత వచ్చిన మార్పులను సజ్నా వివరించింది. ప్రస్తుతం నా జీవితంలో ఒంటరిగా ప్రయాణిస్తున్నానని సజ్నా తెలిపింది. అయితే ఒకసారి నేను విడాకుల కోసం దాఖలు చేసిన తర్వాత దుబాయ్‌లో ఓ ఈవెంట్‌కి వెళ్లానని వెల్లడించింది. అక్కడ ఉన్న నా కుటుంబానికి చెందిన సోదరుడి లాంటి వ్యక్తి నాతో చెడుగా ప్రవర్తించాడని చెప్పింది. వాడు నా వీపు మీద చెయ్యి వేసి అసభ్యంగా వ్యవహరించాడు. అతనికి చెడు ఉద్దేశాలు ఉంటే నేను అర్థం చేసుకోలేకపోయానని.. దీంతో ఏడుస్తూ కూర్చున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ఫిరోజ్, సజ్నాలకు ఇది రెండో వివాహం కాగా.. ఈ జంట మలయాళంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్టారు. ఈ జంట షో మధ్యలోనే ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం సజ్నా టీవీ సీరియల్స్‌లో యాక్టివ్‌గా ఉంది. (ఇది చదవండి: ఈ విషయం చెప్పేందుకు సిగ్గుతో తలదించుకుంటున్నా: విశాల్) View this post on Instagram A post shared by SAJNANOOR (@itssajnanoor) View this post on Instagram A post shared by SAJNANOOR (@itssajnanoor) -
సజన్‌కు రజతం
న్యూఢిల్లీ: ప్రపంచ జూనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో భారత్‌కు రెండు పతకాలు లభించాయి. స్లొవేకియాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో సజన్ భన్వాల్ (77 కేజీలు) రజతం... విజయ్ (55 కేజీలు) కాంస్యం సాధించారు. ఫైనల్లో సజన్ 0–8తో ఇస్లామ్ ఒపియెవ్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. కాంస్య పతక బౌట్లో విజయ్ 16–8తో లిమాన్ (టర్కీ)పై గెలుపొందాడు. -
నీరు తెచ్చిన కష్టం
ట్యాంకర్ కోసం తల్లిదండ్రుల పరుగులు భవనం పైనుంచి పడి చిన్నారికి తీవ్ర గాయాలు కుత్బుల్లాపూర్‌లో ఇదీ దుస్థితి కుత్బుల్లాపూర్: నీటి కష్టాలు నాలుగేళ్ల చిన్నారి పాలిట శాపంగా మారాయి. తల్లి మంచినీళ్ల కోసం ట్యాంకర్ వెంట పరుగులు పెడుతుండడాన్ని చూస్తూ రెండంతస్తుల పైనుంచి జారి పడి నాలుగేళ్ల చిన్నారి తీవ్ర గాయాలపాలైంది. కుత్బుల్లాపూర్ సర్కిల్ ప్రసూన నగర్‌కు బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో నీటి ట్యాంకర్ వచ్చింది. స్థానికంగా ఉండే దస్తగిరి, నాగలక్ష్మి దంపతులు బిందెలు తీసుకుని క్యూలో నిలుచున్నారు. నీళ్లు దొరక్కపోవడంతో తల్లి నాగలక్ష్మి ట్యాంకర్ల వెంట పరుగులు పెట్టారు. ఇదంతా రెండోఅంతస్తు నుంచి చూస్తున్న పెద్ద కుమార్తె నాగ సజన(4) ఒక్కసారిగా భవనంపై నుంచి జారి కింద పడింది. తీవ్ర గాయాలైన చిన్నారిని హుటాహుటిన చింతల్ హ్యాపీ చిల్డ్రన్స్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో మెరుగైన వైద్యం కోసం అమీర్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఇదే కాలనీలో నీటి కోసం జరిగిన యుద్ధంలో ఓ మహిళ ముక్కుకు గాయమైంది. బుధవారం నాగేశ్వరరావు అనే వ్యక్తి వేలికి గాయమైంది. ఇలా అధికారులు నీటి కష్టాలు తెచ్చి పెట్టడంతో జనం అవస్థలు పడుతూ రహదారిపై నీళ్ల ట్యాంకర్ కనిపిస్తే చాలు దాని వెంట పరుగులు పెడుతున్నారు. రెండో రోజూ కన్నీటి కష్టాలే.. కుత్బుల్లాపూర్ సర్కిల్లో రెండోరోజైన బుధవారమూనీటి యుద్ధాలు కొనసాగాయి. వివిధ కాలనీల్లో జనం ట్యాంకర్ నీళ్ల కోసం క్యూ కట్టారు. సర్కిల్లోని 200 కాలనీల్లో సుమారు 5 లక్షల జనాభా ఉంది. మురికివాడలు అత్యధికంగా ఉండే ఈ ప్రాంతంలో సుమారు 40 కాలనీలకు తాగునీటి పైపులైన్ వ్యవస్థ లేదు. 58 వేల నల్లా కనెక్షన్లకు గత మూడు రోజులుగా నీటి సరఫరా నిలిపివేయడంతో ఈ కన్నీటి కష్టాలు మొదలయ్యాయి. నీటి సరఫరాకు కేవలం 36 ట్యాంకర్లను ఏర్పాటు చేయడంతో వీటి వద్ద యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. వాటర్ ట్యాంకర్ల డ్రైవర్లు సైతం డ్రమ్ముకు రూ.40 చొప్పున వసూలు చేస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అధికారుల నిఘా లోపం, బాధ్యతా రాహిత్యం వల్లనే తాగునీటి కష్టాల వచ్చాయని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.