సక్కుబాయినగర్లో మహిళ మృతదేహం లభ్యం
హైదరాబాద్ : నగరంలోని గోల్కొండ సక్కుబాయినగర్ ప్రాంతంలో మంగళవారం మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సదరు మహిళను దుండగులు అత్యాచారం చేసి చంపినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పరిసర ప్రాంతాల్లోని స్థానికులను పోలీసులు విచారిస్తున్నారు.