Sameer Kochhar
-
ఏపీలో అన్ని వర్గాల సమానాభివృద్ధి
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వర్గాలు సమానంగా అభివృద్ధి చెందుతున్నాయని, సామాజిక, ఆరి్థక పరంగా మార్పులు కనిపిస్తున్నాయని, ఈ విధానాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని అమలుచేయాల్సిన అవసరముందని స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చర్ తెలిపారు. సీఎం సూచన మేరకు రాష్ట్రంలో సామాజికంగా, ఆర్థికంగా వచ్చిన మార్పులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా మహిళా సాధికారికతకు వైఎస్ జగన్ అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని, ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు, వరుసగా నాలుగేళ్లపాటు ఆర్థిక సాయం అందించడమే కాక వారిని చేయిపట్టుకుని నడిపిస్తూ పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చి వారి జీవనోపాధిని మెరుగుపరుస్తున్నారని సమీర్ కొచ్చర్ వివరించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఆయన సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడారు. 2005లో ఆంధ్రప్రదేశ్ వచ్చానని, అప్పుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రంలో సామాజికంగా, ఆరి్థకంగా మార్పులను ఎలా తీసుకొచ్చారో అధ్యయనం చేసి డాక్యుమెంట్ రూపొందించానన్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో సామాజికంగా, ఆర్థికంగా చాలా మార్పులు కనిపిస్తున్నాయని తెలిపారు. మహిళా సాధికారికతలో భాగంగా మహిళల జీవనోపాధి మెరుగుపరచడమే కాక.. వారి ఆరోగ్యానికి భరోసా కల్పించారని చెప్పారు. విద్యా రంగంపై పెద్దఎత్తున వ్యయం చేస్తున్నారని, తరగతి గదులను డిజిటలైజ్ చేస్తున్నారని, మూడో తరగతి నుంచే ప్రపంచస్థాయి సిలబస్‌తో టోఫెల్ పరీక్షలు నిర్వహించనున్నారని సమీర్ తెలిపారు. అలాగే, వైద్య రంగంలోనూ చాలా మార్పులు తీసుకొచ్చారని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయి నుంచి పెద్దఎత్తున వ్యయంచేస్తున్నారని, ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలుచేస్తున్నారని ఆయన తెలిపారు. అంతేకాక.. వ్యవసాయ రంగంలో రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన ఇన్‌పుట్స్‌ను అందిస్తున్నారని, దేశంలో తొలిసారిగా ఏపీలోనే ఇలాంటి కేంద్రాలున్నాయని, ఇతర రాష్ట్రాలు కూడా వీటిని అనుసరించాల్సిన అవసరముందని ఆయన కొనియాడారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్.. ఇక 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుందని, సంపద అందరికీ సమానంగా అందితేనే సామాజికంగా ఆర్థికంగా మార్పులు వస్తాయని సమీర్ తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచన మేరకు రాష్ట్రంలో సామాజికంగా, ఆర్థికంగా వచ్చిన మార్పులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయడానికి ఒక బృందాన్ని పంపించనున్నట్లు ఆయన తెలిపారు. సీఎంతో జరిగిన భేటీలో స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చర్ తన‘ఇండియా 2047 హై ఇన్కమ్ విత్ ఈక్విటీ’ పుస్తకాన్ని ముఖ్యమంత్రికి బహూకరించారు. సమీర్ కొచ్చర్‌ను సీఎం జగన్ సత్కరించారు. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో స్కోచ్ గ్రూప్ వైస్ చైర్మన్ డాక్టర్ గురుశరణ్ ధంజల్, డైరెక్టర్ రోహణ్ కొచ్చర్ పాల్గొన్నారు. చదవండి: ‘ఈనాడు’ రిపోర్టర్లపై కేసు నమోదు చేయండి.. నెల్లూరు కోర్టు ఆదేశం -
‘మా’ ఎన్నికలు: ప్రకాశ్ రాజ్ ఆఫీసులో బిగ్‌బాస్ సభ్యులకు నైట్ పార్టీ!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సారి అధ్యక్ష బరికి నలుగురు పోటీ పడుతుండటంతో ఎవరు అందుకోబోతున్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అభ్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శులు చేసుకుంటూ వివాదాలకు తెరలెపారు. ఈ క్రమంలో ‘మా’ ఎన్నికల తేదీని మా క్రమశిక్షణ సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 10న ఎన్నికలు నిర్వహించనున్నట్లు క్రమ శిక్షణ కమిటీ తమ ప్రకటనలో వెల్లడించింది. దీంతో అభ్యర్థులు తమ ప్యానల్ సభ్యులతో ప్రచారం ముమ్మురం చేశారు. ఈ నేపథ్యంలో మా ఎన్నికలకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ప్రచారంలో భాగంగా మా సభ్యులను ప్రసన్నం చేసుకునేందుకు నైట్ పార్టీల జోరందుకుంది. కాగా ఆగష్టు 29న(రేపు) నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు(శనివారం) రాత్రి తెలుగు బిగ్‌బాస్ 4 సీజన్ల కంటెస్టెంట్స్‌కు నైట్ పార్టీ ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ వాట్సప్ గ్రూప్‌లో నటుడు సమీర్ ఆహ్వాన మేసేజ్‌లు పంపినట్లు సమాచారం. అంతేగాక నాగార్జున బర్త్‌డే సందర్భంగా ప్రకాశ్ రాజ్ ఆఫీసులో జరిగే సెలబ్రెషన్స్‌కు నాలుగు సీజన్ల బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ హాజరు కావాల్సిందిగా వాట్సప్ గ్రూప్‌లో ఆహ్వానించినట్లు సమాచారం. కాగా ఈసారి అధ్యక్ష బరిలో ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహారావు, జీవితా రాజశేఖర్ హేమలు ఉన్నారు. చివరి నిమిషంలో ఎవరైనా బరిలోకి దిగుతారా? లేక ఎవరినైనా ఏకగ్రీవం చేస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు నటీనటుల సమస్యల పరిష్కారంతో పాటు, ‘మా’ నూతన భవనం ప్రధాన అజెండాగా ఈసారి ఎన్నికలు జరగనున్నాయి. -
కోలీవుడ్‌కు ఉత్తరాది క్రికెటర్
టీ.నగర్: దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది క్రికెట్ అభిమానులకు సమీర్ కొచ్చర్ తెలియని వారుండరు. ప్రారంభ కాలంలో తన కెరీర్ దూరదర్శన్ టెలివిజన్‌లో ప్రసారమైన ‘హాత్ సే హాత్ మిలా’ ఎయిడ్స్‌పై అవగాహనా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం బాలీవుడ్ స్థాయికి ఎదిగారు. ఇతని నటనలో ప్రస్తుతం ‘నెట్‌ఫ్లిక్స్’లో ప్రసారమవుతున్న ‘సేక్రెడ్ గేమ్స్’ అనే సీరియల్ అభిమానుల నుంచి ఆదరాభిమానాలను చూరగొంటున్నది. అంతేకాకుండా ‘జనత్’, ‘హౌస్‌ఫుల్ 3’ విజయవంతమైన బాలివుడ్ చిత్రాల్లోను నటించారు. ఇలావుండగా సెంచురీ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ నిర్మాణంలో అమలాపాల్ ప్రముఖ పాత్రలో నటిస్తున్న ‘అదో అంద పరవై పోల’ చిత్రం ద్వారా తమిళ చిత్రరంగానికి పరిచయమయ్యారు సమీర్ కొచ్చర్. ఈ చిత్రం కథలో తన పాత్ర ప్రాధాన్యత గుర్తించి అందుకు తగిన విధంగా నటించేందుకు సమ్మతం తెలపడమే కాకుండా, తన నటనతో చిత్రం యూనిట్‌ను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ‘తుమ్సే ప్యార్ కితనా’ అనే బాలివుడ్ చిత్రంలోనూ నటిస్తున్నారు. -
'మోడీనోమిక్స్' ఆవిష్కరించనున్న మోడీ
గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ రచయిత సమీర్ కొచ్చర్ రచించిన మోడీనోమిక్స్ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. శనివారం న్యూఢిల్లీలో లోధి రోడ్డులోని ఇండియన్ హెబిటేట్ సెంటర్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో మోడీ ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. గుజరాత్లో మోడీ సమర్థవంతమైన పాలనతోపాటు, మోడీ చేపట్టిన విధి విధానాలతో రాష్ట్రాభివృద్ధి జరిగిన తీరు ఆ పుస్తకంలో పూసగుచ్చినట్లు రచయిత సమీర్ వివరించారు. అంతేకాకుండా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ దార్శనికత వెనక ఉన్న ఆర్థిక, అభివృద్ది వ్యూహాలను మోడీనోమిక్స్ పుస్తకంలో విశదీకరించారు. ఆ పుసక్తావిష్కరణ కార్యక్రమానికి సీనియర్ బీజేపీ నాయకుడు అరుణ్ జైట్లీ కూడా పాల్గొనున్నారు.