![Samir Kochhar In South Indian Film With Amala Paul - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/27/sameer-kochar.jpg.webp?itok=5FaHTMy9)
టీ.నగర్: దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది క్రికెట్ అభిమానులకు సమీర్ కొచ్చర్ తెలియని వారుండరు. ప్రారంభ కాలంలో తన కెరీర్ దూరదర్శన్ టెలివిజన్‌లో ప్రసారమైన ‘హాత్ సే హాత్ మిలా’ ఎయిడ్స్‌పై అవగాహనా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం బాలీవుడ్ స్థాయికి ఎదిగారు. ఇతని నటనలో ప్రస్తుతం ‘నెట్‌ఫ్లిక్స్’లో ప్రసారమవుతున్న ‘సేక్రెడ్ గేమ్స్’ అనే సీరియల్ అభిమానుల నుంచి ఆదరాభిమానాలను చూరగొంటున్నది. అంతేకాకుండా ‘జనత్’, ‘హౌస్‌ఫుల్ 3’ విజయవంతమైన బాలివుడ్ చిత్రాల్లోను నటించారు.
ఇలావుండగా సెంచురీ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ నిర్మాణంలో అమలాపాల్ ప్రముఖ పాత్రలో నటిస్తున్న ‘అదో అంద పరవై పోల’ చిత్రం ద్వారా తమిళ చిత్రరంగానికి పరిచయమయ్యారు సమీర్ కొచ్చర్. ఈ చిత్రం కథలో తన పాత్ర ప్రాధాన్యత గుర్తించి అందుకు తగిన విధంగా నటించేందుకు సమ్మతం తెలపడమే కాకుండా, తన నటనతో చిత్రం యూనిట్‌ను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ‘తుమ్‌సే ప్యార్ కితనా’ అనే బాలివుడ్ చిత్రంలోనూ నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment