samia farukhee
-
సామియాకు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: బల్గేరియా జూనియర్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ క్రీడాకారిణి సామియా ఇమాద్ ఫారూఖి స్వర్ణ పతకం సాధించింది. బల్గేరియాలో ఆదివారం జరిగిన బాలికల సింగిల్స్ ఫైనల్లో సామియా 9–21, 21–12, 22–20తో రెండో సీడ్ అనస్తాసియా షపోవలోవా (రష్యా)పై గెలిచింది. బాలుర డబుల్స్ విభాగంలో తెలంగాణ ఆటగాడు విష్ణువర్ధన్ గౌడ్–ఇషాన్ భట్నాగర్ (భారత్) జంటకు రజతం లభించింది. ఫైనల్లో విష్ణువర్ధన్–ఇషాన్ జోడీ 19–21, 18–21తో విలియమ్ జోన్స్–బ్రెండన్ జి హావో (బ్రిటన్) జంట చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్‌లో ఎడ్విన్ జాయ్–శ్రుతి మిశ్రా (భారత్); బాలికల డబుల్స్‌లో తనీషా–అదితి భట్ (భారత్) జోడీలకు స్వర్ణ పతకాలు లభించాయి. -
చాంపియన్ సామియా
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారిణి సామియా ఇమాద్ ఫారూఖి సత్తా చాటింది. తమిళనాడులోని చెన్నైలో జరిగిన ఈ టోర్నీలో అండర్–19 బాలికల సింగిల్స్ విభాగంలో సామియా విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఐదో సీడ్ సామియా 21–17, 21–12తో పదహారో సీడ్ ఆషి రావత్ (ఢిల్లీ)పై గెలుపొంది టైటిల్‌ను కైవసం చేసుకుంది. సెమీఫైనల్లో సామియా 21–16, 21–13తో అక్షయ అర్ముగం (తమిళనాడు)పై విజయం సాధించింది. బాలుర సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ మైస్నమ్ మీరాబా (మణిపూర్) టైటిల్‌ను అందుకున్నాడు. ఫైనల్లో మైస్నమ్ 21–19, 12–7తో ఆధిక్యంలో ఉన్న సమయంలో ప్రత్యర్థి ఆకాశ్ యాదవ్ (ఢిల్లీ) రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగడంతో మైస్నమ్ విజేతగా నిలిచాడు. బాలుర డబుల్స్ విభాగంలో పి. విష్ణువర్ధన్ (తెలంగాణ) జంట టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. తుదిపోరులో రెండో సీడ్ ఇషాన్ భట్నాగర్ (ఛత్తీస్‌గఢ్)–పి. విష్ణువర్ధన్ గౌడ్ (తెలంగాణ) ద్వయం 21–18, 21–13తో టాప్ సీడ్ మంజిత్ సింగ్–డింకూ సింగ్ (మణిపూర్) జంటపై నెగ్గిం ది. సెమీఫైనల్లో విష్ణువర్ధన్ జోడీ 21–16, 21–23, 21–14తో ఐదో సీడ్ యశ్ రైక్వార్ (మధ్యప్రదేశ్)–ఇమాన్ సోనోవాల్ (అస్సాం) జంటపై నెగ్గింది. -
క్వార్టర్ ఫైనల్లో సామియా ఫరూఖి
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి సామియా ఫరూఖి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన అండర్-17 బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సామియా ఫరూఖి (తెలంగాణ) 17-21, 21-18, 21-11తో పూర్వ (మహారాష్ట్ర)పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో పుల్లెల గాయత్రి 14-21, 15-21తో ఉన్నతి బిషత్ (ఉత్తరాఖండ్) చేతిలో పరాజయం పాలైంది. అండర్-19 బాలికల ప్రిక్వార్టర్స్‌లో అస్మిత చలిహా (అస్సాం) 18-21, 21-13, 21-8తో కేయూర (తెలంగాణ)ను ఓడించింది. రెండో రౌండ్ ఫలితాలు అండర్-17 బాలుర సింగిల్స్ : ఆదిత్య గుప్తా (తెలంగాణ) 8-21, 22-20, 21-13తో కరణ్ నేగి (హిమాచల్ ప్రదేశ్)పై, జశ్వంత్ (ఆంధ్రప్రదేశ్) 21-15, 21-13తో అనిరుధ్ (గుజరాత్ ) పై, సాయి దత్తాత్రేయ (ఆంధ్రప్రదేశ్) 21-17, 10-21, 21-18తో ధ్రువ్ రావత్ (ఉత్తరాఖండ్)పై విజయం సాధించారు. అండర్-19 బాలుర సింగిల్స్: జశ్వంత్ (ఆంధ్రప్రదేశ్) 21-10, 21-9తో శ్రీకర్ (ఆంధ్రప్రదేశ్)పై నెగ్గాడు. బాలుర డబుల్స్: ఖదీర్ మొయినుద్దీన్- విష్ణువర్ధన్ (తెలంగాణ) జోడి 25-23, 16-21, 21-18తో కుశ్ (హరియాణా)-పీయూష్ కుమార్ (ఉత్తరప్రదేశ్) జంటపై, నవనీత్-సిద్దార్థ్ (తెలంగాణ) 23-21, 21-18తో తపస్ శుక్లా-శుభమ్ యాదవ్ (ఉత్తరప్రదేశ్) జంటపై, సాయి పవన్ (ఆంధ్రప్రదేశ్)-సాయి కుమార్ (తెలంగాణ) జోడి 21-9, 21-17తో సుదీశ్ (ఏపీ)-తరుణ్ కుమార్(తెలంగాణ) జంటపై గెలుపొందా