క్వార్టర్ ఫైనల్లో సామియా ఫరూఖి | samia farukhee enters quarter final in all india badminton | Sakshi
Sakshi News home page

క్వార్టర్ ఫైనల్లో సామియా ఫరూఖి

Published Fri, Aug 26 2016 11:04 AM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

samia farukhee enters quarter final in all india badminton

సాక్షి, హైదరాబాద్: ఆలిండియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి సామియా ఫరూఖి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన అండర్-17 బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సామియా ఫరూఖి (తెలంగాణ) 17-21, 21-18, 21-11తో పూర్వ (మహారాష్ట్ర)పై విజయం సాధించింది.

 

మరో మ్యాచ్‌లో పుల్లెల గాయత్రి 14-21, 15-21తో ఉన్నతి బిషత్ (ఉత్తరాఖండ్) చేతిలో పరాజయం పాలైంది. అండర్-19 బాలికల ప్రిక్వార్టర్స్‌లో అస్మిత చలిహా (అస్సాం) 18-21, 21-13, 21-8తో కేయూర (తెలంగాణ)ను ఓడించింది.

 

 రెండో రౌండ్ ఫలితాలు
 
 అండర్-17 బాలుర సింగిల్స్ : ఆదిత్య గుప్తా (తెలంగాణ) 8-21, 22-20, 21-13తో కరణ్ నేగి (హిమాచల్ ప్రదేశ్)పై, జశ్వంత్ (ఆంధ్రప్రదేశ్) 21-15, 21-13తో అనిరుధ్ (గుజరాత్ ) పై, సాయి దత్తాత్రేయ (ఆంధ్రప్రదేశ్) 21-17, 10-21, 21-18తో ధ్రువ్ రావత్ (ఉత్తరాఖండ్)పై విజయం సాధించారు.


 అండర్-19 బాలుర సింగిల్స్: జశ్వంత్ (ఆంధ్రప్రదేశ్) 21-10, 21-9తో శ్రీకర్ (ఆంధ్రప్రదేశ్)పై నెగ్గాడు.


 బాలుర డబుల్స్: ఖదీర్ మొయినుద్దీన్- విష్ణువర్ధన్ (తెలంగాణ) జోడి 25-23, 16-21, 21-18తో కుశ్ (హరియాణా)-పీయూష్ కుమార్ (ఉత్తరప్రదేశ్) జంటపై, నవనీత్-సిద్దార్థ్ (తెలంగాణ) 23-21, 21-18తో తపస్ శుక్లా-శుభమ్ యాదవ్ (ఉత్తరప్రదేశ్) జంటపై, సాయి పవన్ (ఆంధ్రప్రదేశ్)-సాయి కుమార్ (తెలంగాణ) జోడి 21-9, 21-17తో సుదీశ్ (ఏపీ)-తరుణ్ కుమార్(తెలంగాణ) జంటపై గెలుపొందా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement