all india junior badminton
-
సాయివిష్ణు, భార్గవి శుభారంభం
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారులు పుల్లెల సాయివిష్ణు, కె. భార్గవి శుభారంభం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో సోమవారం జరిగిన అండర్–15 బాలుర తొలిరౌండ్లో సాయివిష్ణు (తెలంగాణ) 21–19, 21–15తో సత„ŠS సింగ్ (ఢిల్లీ)పై, ప్రణవ్ రావు (తెలంగాణ) 21–11, 21–9తో భార్గవ్ రామిరెడ్డి (తెలంగాణ)పై గెలుపొందారు. బాలికల సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ భార్గవి (తెలంగాణ) 21–18, 21–18తో అవంతిక పాండే (ఉత్తరాఖండ్)పై, ఎనిమిదో సీడ్ కైవల్య లక్ష్మి (తెలంగాణ) 21–14, 21–15తో విదుషి సింగ్‌పై, తొమ్మిదో సీడ్ మేఘనా రెడ్డి (తెలంగాణ) 21–14, 21–11తో రియా (కేరళ)పై, అభిలాష 21–9, 21–12తో ఐశ్వర్య మెహతా (ఉత్తరాఖండ్)పై విజయం సాధించారు. అండర్–13 బాలుర తొలిరౌండ్ ఫలితాలు: లోకేశ్ రెడ్డి (తెలంగాణ) 21–14, 21–11తో నాగ మణికంఠ (ఏపీ)పై, అక్షత్ రెడ్డి (తెలంగాణ) 21–18, 21–16తో సాత్విక్ రెడ్డి (ఏపీ)పై, ఆశ్రిత్ వలిశెట్టి (తెలంగాణ) 21–18, 21–23, 21–18తో నిధిశ్ భట్‌పై, రుషేంద్ర తిరుపతి (తెలంగాణ) 18–21, 21–16, 21–9తో ఎల్. లోకేశ్ (తెలంగాణ)పై, అభినయ్ సాయిరాం (తెలంగాణ) 21–19, 21–6తో పూజిత్ రెడ్డిపై గెలుపొందారు. బాలికలు: ప్రసన్న (తెలంగాణ) 21–9, 21–6తో ప్రియామృత (ఏపీ)పై, అమూల్య (తెలంగాణ) 21–17, 16–21, 21–18తో కర్నిక శ్రీ (కర్నాటక)పై, శ్రీనిత్య 21–10, 21–16తో ఆషిత (మధ్యప్రదేశ్)పై నెగ్గారు. -
సింగిల్స్ చాంప్ గాయత్రి
తిరువనంతపురం: ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి పుల్లెల గాయత్రి టైటిల్‌తో మెరిసింది. అండర్–17 బాలికల సింగిల్స్‌లో ఆమె విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో గాయత్రి 21–12, 21–23, 21–6తో చత్తీస్‌గఢ్‌కు చెందిన టాప్ సీడ్ ఆకర్షి కశ్యప్‌పై విజయం సాధించింది. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తనయ గాయత్రికి ఒక్క రెండో గేమ్‌లోనే ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఇందులోనూ పోరాడినప్పటికీ ఆకర్షి దూకుడుకు తలవంచింది. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో ఆరంభం నుంచే చెలరేగింది. దీంతో టాప్ సీడ్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అండర్–17 బాలికల టైటిల్‌ను సాహితి బండి (తెలంగాణ)–వర్షిణి (తమిళనాడు) జోడి గెలుచుకుంది. ఫైనల్లో ఈ మూడో సీడ్ జోడి 21–15, 10–21, 21–17తో కెయూర మొపతి– కవిప్రియ (తెలంగాణ) జంటను ఓడించింది. అండర్–17 బాలుర సింగిల్స్ తుదిపోరులో టాప్ సీడ్ మైస్నమ్ మిరబా 21–12, 21–12తో ధ్రువ్ రావత్‌పై నెగ్గాడు. డబుల్స్ ఫైనల్లో యశ్–ధ్రువ్ రావత్ 21–14, 10–21, 21–13తో ఎడ్విన్ జాయ్–అరవింద్ సురేశ్ జంటపై నెగ్గింది. అండర్–19 డబుల్స్ ఫైనల్లో రాహుల్ భరద్వాజ్ 21–15, 21–14తో టాప్ సీడ్ కార్తీకేయ్ కుమార్‌కు షాకిచ్చాడు. అండర్–19 బాలికల సింగిల్స్ టైటిల్ పోరులో పూర్వ బర్వే 27–25, 21–13తో అశ్విని భట్‌పై, డబుల్స్‌లో మిథుల–రుతపర్ణ పండ 21–14, 21–18తో అశ్విన్‌భట్–అపేక్ష నాయక్ జంటపై, అండర్–19 బాలుర డబుల్స్‌లో సంజయ్–సిద్ధార్థ్ 15–21, 21–12, 21–18తో సౌరభ్– రామ్‌భియా దీప్‌లపై గెలుపొందారు. -
సాయి కృష్ణ-పవన్ జంటకు టైటిల్
ఆలిండియా ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ర్యాంకింగ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో అండర్-17 బాలుర డబుల్స్ విభాగంలో సాయి కృష్ణ పొదిలి (తెలంగాణ)-కర్రి సాయి పవన్ (ఏపీ) జోడి విజేతగా నిలిచింది. తిరుపతిలో శనివారం ముగిసిన ఈ టోర్నమెంట్ ఫైన ల్లో సాయి కృష్ణ-సాయి పవన్ ద్వయం 19-21, 21-14, 21-10తో ఖదీర్ మొయినుద్దీన్-విష్ణువర్ధన్ గౌడ్ (తెలంగాణ) జంటపై విజయం సాధిం చి టైటిల్‌ను కై వసం చేసుకుంది. అండర్-17 బాలికల డబుల్స్ ఫైనల్లో సామియా ఫరూఖి-పుల్లెల గాయత్రి (తెలంగాణ) జోడి 19-21, 17-21తో అశ్విని భట్- మిథులా (కర్ణాటక) జంట చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అండర్-17 బాలికల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి ప్రాశి జోషి రన్నరప్‌గా నిలిచింది. ఎయిరిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాశి జోషి ఫైనల్లో 19-21, 14-21తో ఆకర్షి కశ్యప్ (చత్తీస్‌గఢ్) చేతిలో ఓడిపోయింది. బాలుర ఫైనల్స్‌లో కార్తికేయ గుల్షాన్ (ఎయిరిండియా) 21-15, 19-21, 21-13తో మైస్నమ్ (మణిపూర్)పై గెలుపొంది విజేతగా నిలిచాడు. అండర్-19 బాలుర సింగిల్స్ విభాగంలో ఎయిరిండియాకు ఆడిన తెలుగు ప్లేయర్ ఎం.కనిష్క్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో కనిష్క్ 15-21, 15-21తో లక్ష్య సేన్ (ఉత్తరాఖండ్) చేతిలో ఓడిపోయాడు. బాలికల సింగిల్స్ ఫైనల్లో ఆకర్షి కశ్యప్ (చత్తీస్‌గఢ్) 17-21, 21-7, 21-13తో శిఖా (కర్ణాటక)ను ఓడించింది. అండర్-19 బాలుర డబుల్స్ ఫైనల్లో కృష్ణ ప్రసాద్ (ఏపీ)-ధ్రువ్ జంట 21-13, 21-12తో గౌస్ షేక్- బషీర్ సయ్యద్ (ఏపీ) జంటపై నెగ్గింది. బాలికల డబుల్స్ ఫైనల్లో మహిమ- శిఖా గౌతమ్ (పీఎన్బీ) జంట 18-21, 21-15, 21-17తో అశ్విని- మిథులా (కర్ణాటక) జోడిపై నెగ్గింది. అండర్-19 మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో కృష్ణ ప్రసాద్ (ఏపీ)- మహిమ (కర్ణాటక) జోడి 21-16, 21-14తో ధ్రువ్- కుహు గార్గ్ (ఉత్తరాఖండ్)పై గెలిచింది. -
క్వార్టర్ ఫైనల్లో సామియా ఫరూఖి
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి సామియా ఫరూఖి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన అండర్-17 బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సామియా ఫరూఖి (తెలంగాణ) 17-21, 21-18, 21-11తో పూర్వ (మహారాష్ట్ర)పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో పుల్లెల గాయత్రి 14-21, 15-21తో ఉన్నతి బిషత్ (ఉత్తరాఖండ్) చేతిలో పరాజయం పాలైంది. అండర్-19 బాలికల ప్రిక్వార్టర్స్‌లో అస్మిత చలిహా (అస్సాం) 18-21, 21-13, 21-8తో కేయూర (తెలంగాణ)ను ఓడించింది. రెండో రౌండ్ ఫలితాలు అండర్-17 బాలుర సింగిల్స్ : ఆదిత్య గుప్తా (తెలంగాణ) 8-21, 22-20, 21-13తో కరణ్ నేగి (హిమాచల్ ప్రదేశ్)పై, జశ్వంత్ (ఆంధ్రప్రదేశ్) 21-15, 21-13తో అనిరుధ్ (గుజరాత్ ) పై, సాయి దత్తాత్రేయ (ఆంధ్రప్రదేశ్) 21-17, 10-21, 21-18తో ధ్రువ్ రావత్ (ఉత్తరాఖండ్)పై విజయం సాధించారు. అండర్-19 బాలుర సింగిల్స్: జశ్వంత్ (ఆంధ్రప్రదేశ్) 21-10, 21-9తో శ్రీకర్ (ఆంధ్రప్రదేశ్)పై నెగ్గాడు. బాలుర డబుల్స్: ఖదీర్ మొయినుద్దీన్- విష్ణువర్ధన్ (తెలంగాణ) జోడి 25-23, 16-21, 21-18తో కుశ్ (హరియాణా)-పీయూష్ కుమార్ (ఉత్తరప్రదేశ్) జంటపై, నవనీత్-సిద్దార్థ్ (తెలంగాణ) 23-21, 21-18తో తపస్ శుక్లా-శుభమ్ యాదవ్ (ఉత్తరప్రదేశ్) జంటపై, సాయి పవన్ (ఆంధ్రప్రదేశ్)-సాయి కుమార్ (తెలంగాణ) జోడి 21-9, 21-17తో సుదీశ్ (ఏపీ)-తరుణ్ కుమార్(తెలంగాణ) జంటపై గెలుపొందా