sampooresh babu
-
చెప్పిన టైమ్ కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ సినిమా
థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కాకపోతే స్టార్స్ ఎవరూ లేకపోవడంతో ఎందుకో ప్రేక్షకులకు పెద్దగా రీచ్ కాలేదు. దీంతో ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు. అయితే చెప్పిన టైమ్ కంటే ముందే ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందుకు రిలీజైంది? సినిమా సంగతేంటి? 2020లో తమిళంలో రిలీజై, హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా 'మండేలా'. దాదాపు మూడేళ్ల తర్వాత దీన్ని తెలుగులో 'మార్టిన్ లూథర్ కింగ్' పేరుతో రీమేక్ చేశారు. సంపూర్ణేశ్ బాబు ప్రధాన పాత్రలో నటించాడు. అక్టోబరు 27న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది గానీ కలెక్షన్స్ రాబట్టంలో కాస్త వెనకబడిపోయింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న 25 సినిమాలు) ఓటీటీలో స్ట్రీమింగ్ దీంతో 'మార్టిన్ లూథర్ కింగ్' మూవీ డిజిటల్ హక్కులు దక్కించుకున్న సోనీ లివ్ సంస్థ.. నవంబరు 29న ఓటీటీలో రిలీజ్ చేస్తామని ప్రకటించింది. మరి ఏమైందో ఏమో గానీ ఓ రోజు ముందే ఓటీటీలోకి తీసుకొచ్చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం అందుబాటులో ఉంది. కథేంటి? పడమరపాడు అనే ఊరు. ప్రెసిడెంట్‌కి ఇద్దరు కొడుకులు. పెద్ద భార్య కొడుకు జగ్గు(వీకే నరేశ్), చిన్న భార్య కొడుకు లోకి(వెంకట్ మహా) ఎప్పుడూ గొడవపడుతూనే ఉంటారు. పలు సమస్యలతో బాధపడుతున్న ఈ ఊరికి ఓ పెద్ద ఫ్యాక్టరీ వస్తుంది. కోట్లల్లో కమీషన్ వస్తుందని తెలిసి.. జగ్గు, లోకి ఇద్దరూ ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడతారు. ఉత్తరం వాళ్లు, దక్షిణం వాళ్లు సమానంగా ఉండడంతో.. ఒక్క ఓటు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్లే ప్రెసిడెంట్ అయ్యే అవకాశముంటుంది. ఆ ఒక్క ఓటే స్మైల్ అలియాస్ మార్టిన్ లూథర్ కింగ్(సంపూర్ణేష్ బాబు)ది. ఇతడి ఓటు కీలకం కావడంతో జగ్గు, లోకి.. కింగ్‌కి కావాల్సినవన్నీ ఇస్తారు. మరి తన ఓటుని అడ్డుపెట్టుకొని కింగ్ ఎలాంటి కోరికలు తీర్చుకున్నాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన సమస్యలు ఏంటి? చివరకు తన ఓటు హక్కుతో ఊరి సమస్యలను ఎలా తీర్చాడు అనేదే మిగతా కథ. (ఇదీ చదవండి: లవర్ని పరిచయం చేసిన 'జబర్దస్త్' నరేశ్.. కాకపోతే!) -
ఓటీటీల్లోకి ఆ రెండు హిట్ మూవీస్.. ఒక్కరోజు గ్యాప్‌లో రిలీజ్!
ఈ రెండు చిన్న సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ప్రేక్షకులకు నచ్చాయి. కానీ థియేటర్లలో సరిగా ఆడకపోవడంతో కలెక్షన్స్ రాలేదు, జనాలకు పెద్దగా రీచ్ కాలేదు. దీంతో అందరూ వీటి గురించి మర్చిపోయారు. తాజాగా ఈ మూవీస్ ఓటీటీ రిలీజ్ తేదీలకు అధికారికంగా ప్రకటించారు. దీంతో మూవీ లవర్స్ అలెర్ట్ అయిపోయారు. ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఎమోషనల్ 'చిన్నా' సిద్ధార్థ్ పేరు చెప్పగానే లవర్ బాయ్ పాత్రలే గుర్తొస్తాయి. అప్పుడెప్పుడో 'బొమ్మరిల్లు', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత సరైన సినిమాలు చేయక.. తెలుగు ఆడియెన్స్‌కి బాగా దూరమైపోయాడు. మధ్యలో కొన్ని రొట్టకొట్టుడు మూవీస్ తీశాడు గానీ హిట్ కొట్టలేకపోయాడు. అలాంటిది స్టైల్ మార్చి.. ఎమోషనల్‌గా సాగే 'చిన్నా' సినిమా చేశారు. దీన్ని స్వయంగా నిర్మించాడు కూడా. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు) తమిళంలో సూపర్‌హిట్ టాక్‌తో పాటు మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా.. తెలుగులో గత నెలలో రాంగ్ టైంలో థియేటర్లలో రిలీజైంది. దీంతో ప్రేక్షకులకు సరిగా రీచ్ కాలేకపోయింది. అలానే ఓటీటీలో నవంబరు 17న వస్తుందని అన్నారు. కానీ అది అబద్ధమని తేలింది. ఇప్పుడు అధికారికంగా నవంబరు 28 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. సో వచ్చాక దీనిపై ఓ లుక్కేసేయండి. సంపూ డిఫరెంట్ సినిమా లాక్డౌన్ టైంలో తమిళంలో సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన 'మండేలా' చిత్రాన్ని తెలుగులో సంపూర్ణేశ్ బాబు హీరోగా 'మార్టిన్ లూథర్ కింగ్' పేరుతో తీశారు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా బాగుందన్నారు గానీ థియేటర్‌కి వెళ్లి పెద్దగా చూడలేదు. ఇప్పుడు సోనీ లివ్ ఓటీటీలో నవంబరు 29 నుంచి స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. సో ఇక్కడ ఆదరణ లభించొచ్చు. సో వచ్చేవారం వీకెండ్ కి ప్లాన్స్ ఏం లేకపోతే ఈ రెండు చిత్రాలు చూసేయొచ్చు. (ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి ఆ తెలుగు సినిమా!) -
నెల రోజుల్లోపే ఓటీటీకి సంపూర్ణేశ్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సంపూర్ణేష్ బాబు, వీకే నరేష్, శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. పొలిటికల్ సెటైరికల్ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రం అక్టోబర్ 27న థియేటర్లలో రిలీజైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ఈ మూవీ నెల రోజులు కాకముందే ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన మార్టిన్ లూథర్ కింగ్ త్వరలోనే ఓటీటీలో అలరించనుంది. నవంబర్ 17న లేదా 24న ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ఓటీటీ రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది. కాగా.. ఈ మూవీ సోనీ లివ్‌లో రిలీజ్ కానున్నట్లు సమాచారం. కాగా.. తమిళంలో విజయవంతమైన మండేలా మూవీకి రీమేక్‌గా మార్టిన్ లూథర్ కింగ్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో డైరెక్టర్ వెంకటేష్ మహా కీలక పాత్ర పోషించారు. అసలు కథేంటంటే.. 'మార్టిన్ లూథర్ కింగ్' ఒక స్థానిక చెప్పులు కుట్టే వ్యక్తి యొక్క కథ. అతను నివసించే గ్రామంలో ఎన్నికలు వస్తాయి. ఇద్దరు ప్రత్యర్థులు ఎలాగైనా గెలవాలని పోటీ పడతారు. అయితే ఆ ఎన్నికలలో అతని ఓటు, గెలుపుని నిర్ణయించే ఓటు కావడంతో ఒక్క రాత్రిలో అతని జీవితం మలుపు తిరుగుతుంది. -
సిద్దిపేట కవులకు పుట్టినిల్లు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): సిద్దిపేట కవులకు పుట్టినిల్లని ప్రముఖ సినీ నటుడు సంపూర్ణేష్‌బాబు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని పీఏస్‌డబ్ల్యూఏ భవనంలో ప్రముఖ కవి కోణం పర్శరాములు రచించిన నీలీమేఘాలు బాలగేయ సంపుటి పుస్తకావిష్కరణలో ఆయన పాల్గొన్నారు. మొదటగా జిల్లాలోని ప్రముఖ కవులు, రచయితల ఆధ్వర్యంలో నీలీమేఘాలు పుస్తకాన్ని అవిష్కరించారు. అనంతరం సంపుర్ణేష్‌బాబు మాట్లాడుతూ... చిన్నతనం నుంచే బాలలు కవితాలు, కథలు చదవాలని అన్నారు. వారు భవిష్యత్‌లో నీతి సంస్కారములు గడించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు, రచయితలు మట్టపల్లి రంగారావు, ఐతా చంద్రయ్య, ఉండ్రాల రాజేశం, లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు, పర్శరాములు, శ్రీనివాస్, సుధాకర్, ఉస్మాన్, బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు. -
స్టేటస్ ఫైట్: వైజాగ్‌కు చేరుకున్న హీరో!
వైజాగ్: ప్రత్యేక హోదా ఆకాంక్షను చాటుతూ వైజాగ్ కేంద్రంగా ఆందోళన కొనసాగుతోంది. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని ఆంక్షలు, అడ్డంకులు సృష్టించినా.. వాటన్నింటినీ ఛేదించుకొని యువత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వైజాగ్ చేరుకుంటున్నారు. ప్రత్యేక హోదా కోసం నిర్వహిస్తున్న మౌనపోరాట దీక్షలో పాల్గొనేందుకు వచ్చిన యువతను, ప్రజలను ఎక్కడికక్కడ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. వైఎస్ జగన్ పిలుపుమేరకు ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన యువతను, విద్యార్థులను పోలీసులు చెదరగొడుతున్నారు. శాంతియుతంగా, సయమనంగా మౌనదీక్షలో పాల్గొంటున్న విద్యార్థులను రెచ్చగొట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. విద్యార్థులపై లాఠీచార్జ్ చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మరోవైపు ప్రత్యేక హోదా ఆందోళనకు మద్దతుగా ప్రముఖ హీరో సంపూర్ణేష్ బాబు వైజాగ్ చేరుకున్నారు. హోదా ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించిన సంపూర్ణేష్ బాబు.. ఈ ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు గురువారం వైజాగ్ వస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్కే బీచ్‌లో నిర్వహించే ప్రత్యేక హోదా నిరసనలో తాను పాల్గొంటానని ఆయన పేర్కొన్నారు.