సిద్దిపేట కవులకు పుట్టినిల్లు | Siddipet Birth To The Poets Says Sampoornesh Babu | Sakshi
Sakshi News home page

సిద్దిపేట కవులకు పుట్టినిల్లు

Published Mon, Mar 26 2018 1:38 PM | Last Updated on Mon, Mar 26 2018 1:38 PM

Siddipet Birth To The Poets Says Sampoornesh Babu - Sakshi

నీలీమేఘాలు పుస్తకావిష్కరణ కార్యక్రమం 

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): సిద్దిపేట కవులకు పుట్టినిల్లని ప్రముఖ సినీ నటుడు సంపూర్ణేష్‌బాబు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని పీఏస్‌డబ్ల్యూఏ భవనంలో ప్రముఖ కవి కోణం పర్శరాములు రచించిన  నీలీమేఘాలు బాలగేయ సంపుటి పుస్తకావిష్కరణలో ఆయన పాల్గొన్నారు. మొదటగా జిల్లాలోని ప్రముఖ కవులు, రచయితల ఆధ్వర్యంలో నీలీమేఘాలు పుస్తకాన్ని అవిష్కరించారు.
 

అనంతరం సంపుర్ణేష్‌బాబు మాట్లాడుతూ... చిన్నతనం నుంచే బాలలు కవితాలు, కథలు చదవాలని అన్నారు. వారు భవిష్యత్‌లో నీతి సంస్కారములు గడించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు, రచయితలు మట్టపల్లి రంగారావు, ఐతా చంద్రయ్య, ఉండ్రాల రాజేశం, లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు, పర్శరాములు, శ్రీనివాస్, సుధాకర్, ఉస్మాన్, బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement