samsmarana sabha
-
విస్తుపోయేలా బాబు సర్కార్ నిర్వాకం.. రామోజీ సంస్మరణ సభ ఖర్చు ఎంతంటే?
సాక్షి, విజయవాడ: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ సభ నిర్వహణ కోసం చంద్రబాబు ప్రభుత్వం ప్రజాధనాన్ని పణంగా పెట్టింది. ఏకంగా రూ.4.28 కోట్లు ఖర్చు చేసింది. జూన్ 27న విజయవాడలో రామోజీ సంస్మరణ సభను చంద్రబాబు సర్కార్ నిర్వహించింది.అయితే, సభను నిర్వహణ ఖర్చు 4.28 కోట్లు రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయం ఇప్పుడు బయటకు రావడంతో రామోజీ సంస్మరణ సభకు అంత భారీగా ఖర్చు చేశారా అంటూ ప్రభుత్వ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఒక వ్యాపార వేత్త సంస్మరణ సభకు రూ.4 కోట్లుపైగా ప్రజాధనాన్ని ఖర్చు చేయడంపై చర్చ కూడా జరుగుతోంది.ఇదీ చదవండి: ఇది సరైన సందేశమేనా? -
జనసంద్రాన్ని తలపించిన మొగల్తూరు.. సుమారు 20 మాంసాహార రకాలతో..
మొగల్తూరు: యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ రాకతో గురువారం మొగల్తూరు జాతరను తలపించింది. జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాల నుంచి అభిమానులు తరలిరావడంతో జాతీయ రహదారిలో తరచూ ట్రాఫిక్ స్తంభించింది. వేకువజామున హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో గ్రామానికి చేరుకున్న ప్రభాస్ ఉదయం 10 గంటల ప్రాంతంలో అభిమానులకు అభివాదం చేసేందుకు బయటకు వచ్చారు. అప్పటికే వేలాది మంది అభిమానులు కృష్ణంరాజు నివాసానికి చేరుకున్నారు. అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుందనే అంచనాలతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు మెస్‌లు ఏర్పాటుచేశారు. మెస్ ఆవల నుంచే ప్రభాస్, కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి, కుమార్తెలు సాయి ప్రసీద, సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తిలు అభిమానులకు అభివాదం చేశారు. సుమారు 50 వేల మందికి పైగా అభిమానులు తరలివచ్చారని అంచనా వేస్తున్నారు. డీఎస్పీ వీరాంజనేయరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 20 మంది అధికారులు, 600 మంది పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేల పరామర్శ ప్రభాస్ కుటుంబసభ్యులను రాష్ట్ర మంత్రులు ఆర్కే రోజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ట, కారుమూరి నాగేశ్వరరావు, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు పరామర్శించారు. కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు మీడియా ప్రతినిధులకు అనుమతి ఇవ్వలేదు. కార్యక్రమంపై నిర్వాహకులను సంప్రదించగా ఎడిట్ చేసిన ఇన్పుట్లు, ఫొటోలు పంపుతామని చెప్పినా ఫలితం లేదు. పసందైన భోజనం కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమానికి మొగల్తూరు మండలంలోని 17 గ్రామాలకు సంబంధించి పార్టీలకు అతీతంగా నాయకులు, స్థానికులకు ఆహ్వానం అందింది. శాఖాహార, మాంసాహార భోజనాలు అందించారు. సుమారు 20 మాంసాహార రకాలు వడ్డించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రభాస్ రాకతో దద్దరిల్లిన మొగల్తూరు.. ప్రతి ఒక్కరికి భోజనం
ఇటీవల స్వర్గస్తులైన రెబల్ స్టార్ కృష్ణంరాజు స్మారక కార్యక్రమం గురువారం కృష్ణంరాజు స్వస్థలమైన మొగల్తూరులో ఘనంగా జరిగింది. ప్రభాస్, కృష్ణంరాజు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మొగల్తూరు వెళ్లారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ప్రభాస్ ఈ ప్రాంతానికి వచ్చారు. ఇన్నేళ్ల తర్వాత ప్రభాస్, ఆయన కుటుంబ సభ్యులు ఊరికి రావడంతో స్థానిక ప్రజలు ఆత్మీయంగా వారికి స్వాగతం చెప్పారు. తాము ఎంతగానో అభిమానించే కృష్ణంరాజు భౌతికంగా దూరమవడం అక్కడి వారిలో ఉద్వేగాన్ని నింపింది. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి స్మారక కార్యక్రమానికి భారీ ఎత్తున స్థానిక ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. వచ్చిన వారిని పలకరించి, అభివాదాలు తెలిపారు ప్రభాస్. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. వచ్చిన ప్రతి ఒక్కరూ సంతృప్తిగా తినేందుకు భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రభాస్ ప్రతి ఒక్కరినీ లంచ్ తిని వెళ్లమని కోరారు. ఈ కార్యక్రమం ఆసాంతం ఉద్వేగపూరితంగా సాగింది. -
ప్రభాస్ అభిమానులతో జనసంద్రమైన మొగల్తూరు (ఫొటోలు)
-
12 ఏళ్ల తర్వాత మొగల్తూరుకు ప్రభాస్.. లక్ష మందికి భోజనాలు!
రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం ఆయన స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. గురువారం మధ్యాహ్నం జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రభాస్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ప్రభాస్ మొగల్తూరు రావడంతో...అతన్ని చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. పట్టణంలో కొంతమంది అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Love you.. ela vunnaru!! #Prabhas ❤️🥺 pic.twitter.com/rYu7J8oXfP — .. (@charanvicky_) September 29, 2022 నేటి మధ్యాహ్నం జరగనున్న ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు వేణు గోపాల కృష్ణ, రోజా, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరు ప్రసాద్ రాజు పాల్గొననున్నారు. సుమారు లక్ష మంది అభిమానులకు భోజన ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులకు ఆయన ఇంటి ఆవరణలో ఏర్పాటు చేశారు. మిగిలిన వారందరికీ కృష్ణంరాజు ఇంటికి దక్షిణం వైపు ఉన్న తోటలో ఏర్పాట్లు చేశారు. 2010లో తండ్రి సూర్య నారాయణ రాజు మరణించిన సమయంలో ప్రభాస్ మొగల్తూరు వెళ్లారు. ఆ సమయంలో వారం రోజుల పాటు అక్కడే ఉండి సంతాప కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత మళ్లీ కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం ప్రభాస్ ఈ ప్రాంతానికి వచ్చాడు. 2 Minutes Silence 🤫 For Those People Who Underestimated About #Prabhas Craze In AP 😎pic.twitter.com/J7zDqamTkF — Prabhas DOMAIN 🏹 (@Prabhas_Domain) September 29, 2022 -
ప్రజల మనిషి బీఎన్ఆర్
అనంతపురం : దానశీలి, మానవతావాది, ప్రజల మనిషి బి.నారాయణరెడ్డి (బీఎన్ఆర్) అని వక్తలు కొనియాడారు. నగరంలోని ఎస్ఎస్బీఎన్ కళాశాల ఆవరణలో ఆదివారం బీఎన్ఆర్ ఆత్మీయ సంస్మరణ సభ జరిగింది. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న బి.నారాయణరెడ్డి ఫొటోలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అనంతరం రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాం నుంచి బీఎన్ఆర్ కుటుంబంతో తనకు అనుబంధం ఉందన్నారు. వైఎస్ మరణానంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయంగా ఆటుపోట్లు ఎదుర్కొంటున్న సమయంలో ఆ కుటుంబం అండగా నిలిచిందన్నారు. బీఎన్ఆర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మాట్లాడుతూ నిజాయతీకి నిలువెత్తు నిదర్శనం బీఎన్ఆర్ అన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ 1989 తర్వాత కాంగ్రెస్‌లో నెలకొన్న అసమ్మతి రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి బీఎన్ఆర్ అండగా నిలిచారన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ అనంతపురం నగర ప్రజలకు తాగునీటి సమస్య తీర్చాలని పదేపదే తనతో చెప్పేవారన్నారు. ఈరోజు పీఏఆర్బీఆర్ నుంచి తాగునీరు లభిస్తోందంటే అందులో బీఎన్ఆర్ కృషి కూడా మరవలేనిదన్నారు. సివిల్ సప్లయ్ కార్పొరేషన్ సంస్థ చైర్మన్ లింగారెడ్డి మాట్లాడుతూ మంచి గుణాలు, సేవాభావం కల్గిన వ్యక్తి బీఎన్ఆర్ అన్నారు. ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ‘అనంత’ మనసులు చూరగొన్న మంచి మనిషి బీఎన్ఆర్ అని అన్నారు. నగర అభివృద్ధిలో ఆయన కృషి మరవలేనిది అన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ మాట్లాడుతూ బీఎన్ఆర్ భౌతికంగా దూరమైనా ప్రజలందరి గుండెల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటారన్నారు. ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ నారాయణరెడ్డి అందర్నీ ఆప్యాయంగా పలుకరించేవారని గుర్తు చేశారు. ఏడీసీసీ బ్యాంకు చైర్మన్ లింగాల శివశంకర్‌రెడ్డి మాట్లాడుతూ నిజాయతీకి ప్రతిరూపం బీఎన్ఆర్ అన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ బీఎన్ఆర్ ఇంటికి ఎప్పుడెళ్లినా ముందుగా యోగక్షేమాలు అడిగి తర్వాత వచ్చిన పని గురించే అడిగేవారన్నారు. నేటి రాజకీయాల్లో అలాంటి వ్యక్తులుండడం చాలా అరుదన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ బి.నారాయనరెడ్డి గొప్ప మానవతావాది అని, విశ్వసనీయతకు మారుపేరు అని కొనియాడారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు అంకాల్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలతోనే బీఎన్ఆర్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. దానగుణంలో ఆయన ముందుండేవారన్నారు. సీపీఐ (ఎంఎల్) నాయకులు పెద్దన్న మాట్లాడుతూ ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సమస్యలపై కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడు ఆందోళనలు నిర్వహించినా శాంతియుతంగా నచ్చజెప్పి సమస్యల పరిష్కారానికి చొరవ చూపేవారని గుర్తు చేశారు. మాజీ మేయర్ రాగే పరుశురాం మాట్లాడుతూ తాను రాజకీయంగా ఈరోజు ఈస్థాయిలో ఉన్నానంటే అది బీఎన్ఆర్ చలువేనన్నారు. వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నదీంఅహ్మద్ మాట్లాడుతూ మంచికి మారుపేరు బీఎన్ఆర్ అన్నారు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో చాలా అరుదన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. స్మారక చిహ్నం ఏర్పాటు అనంతపురం పట్టణాభివృద్ధికి విశేష కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి స్మారక చిహ్నం ఏర్పాటు చేసేందుకు సభలో తీర్మానించారు. ఆయన కుటుంబ సభ్యులకు సంబంధం లేకుండా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. చిహ్నం నిర్మాణానికి తనవంతుగా రూ. లక్ష ఇస్తానని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రకటించగా, పుట్టపర్తి సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి రూ. లక్షా 16 వేలు ప్రకటించారు. కార్యక్రమంలో బీఎన్ఆర్ కుటుంబ సభ్యులు మాజీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, బి.ఎర్రిస్వామిరెడ్డి, బి.రెడ్డప్పరెడ్డి, మాజీమంత్రి నర్సేగౌడ్, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఆలూరి సాంబశివారెడ్డి, నియోజకవర్గాల సమన్వయకర్తలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, వై.వెంకటరామిరెడ్డి, తిప్పేస్వామి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, నాయకులు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, తాడిపత్రి రమేష్‌రెడ్డి, మడకశిర వైటీ ప్రభాకర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షులు కోటా సత్యం, మాజీ మునిసిపల్ చైర్మన్ నూర్ మహమ్మద్, కలీఖుల్లాఖాన్, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ధనుంజయయాదవ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు బుర్రా సురేష్‌గౌడ్, గౌస్‌బేగ్, నగర అధ్యక్షులు రంగంపేట గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
21న పెద్దారెడ్డి సంస్మరణ సభ
అనంతపురం సప్తగిరి సర్కిల్: సామాజిక విప్లవకారుడైన పెద్దారెడ్డి సంస్మరణ సభ ఈ నెల 21న కొత్తచెరువులో నిర్వహిస్తున్నట్లు పోతుల సురేష్ తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూలై 1న పెద్దారెడ్డి మృతి చెందారని, ఆయన జ్ఞాపకార్థంగా సంస్మరణ సభను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో విజయభాస్కర్ రెడ్డి, కార్పొరేటర్ బంగి. సుదర్శన్, రామాంజినేయులు, అల్లాబకష్, లింగమయ్య పాల్గొన్నారు. -
నిరాడంబరుడు ‘చండ్ర’ శేఖర్
మొగల్రాజపురం : తన తండ్రి కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత చండ్ర చంద్రశేఖర్ ఆజాద్ చాలా నిరాడంబర జీవితాన్ని గడిపారని సీపీఐ జాతీయ సమితి కంట్రోల్ కమీషన్ చైర్మన్ ఈడ్పుగంటి నాగేశ్వరరావు అన్నారు. కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత చండ్ర రాజేశ్వరరావు కుమారుడు చండ్ర చంద్రశేఖర్ ఆజాద్ సంస్మరణ సభ సిద్ధార్థ ఆడిటోరియంలో గురువారం జరిగింది. నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆజాద్ గొప్ప విజ్ఞానవంతుడని, చండ్ర రాజేశ్వరరావు(సి.ఆర్.) రాజకీయ వారసత్వంలో ప్రత్యక్షంగా ఆజాద్ లేకపోయినప్పటికీ ఉద్యమాలకు వెన్నుదన్నుగా ఉండేవారన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటి సభ్యుడు సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ వామపక్ష పార్టీలు ప్రస్తుత కాలంలో మరింతగా బలపడాలన్నారు. సీపీఐ (ఎం.ఎల్) రాష్ట్ర నాయకుడు కోటయ్య మాట్లాడుతూ చండ్ర రాజేశ్వరరావు కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యాన్ని గురించి వివరించారు. సీపీఐ సీనియర్ నాయకుడు కొల్లి నాగేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జె.వి.వి.సత్యనారాయణ, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి జి.ఓబులేసు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, మాజీ ఎమ్మెల్యే కె.సుబ్బరాజు, సీపీఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి డి.ప్రభాకర్, సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, పాత్రికేయుడు సి.రాఘవాచారిలతో పాటుగా సి.ఆర్.కుటుంబం అభిమానులు పాల్గొని ఆజాద్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.