Samsung Mobile
-
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 45% వాటా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 2018 డిసెంబరు నాటికి కంపెనీ వాటా 44–45 శాతానికి చేరుతుందని కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ అంచనా వేస్తోంది. జనవరి–జూన్ కాలంలో 39 శాతం వాటాతో నంబర్ వన్ స్థానంలో ఉన్నట్టు శాంసంగ్ మొబైల్ బిజినెస్ డైరెక్టర్ సుమిత్ వాలియా తెలిపారు. గెలాక్సీ ఏ7ను బుధవారం హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కంపెనీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 10–11 శాతం వాటాతో టాప్–5లో ఉంటాయని ఆయన చెప్పారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 16 కొత్త స్మార్ట్ఫోన్లను భారత్‌లో అందుబాటులోకి తెచ్చామన్నారు. త్వరలో నూతన ట్యాబ్లెట్ పీసీలను ప్రవేశపెడతామని వివరించారు. ‘జె’ సిరీస్‌లో 6 కోట్ల ఫోన్లు విక్రయించామన్నారు. ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 12 శాతం వృద్ధి నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నట్లు సుమిత్ పేర్కొన్నారు. -
ప్రపంచంలోనే అతిపెద్ద శాంసంగ్ మొబైల్ ఎక్స్పీరియన్స్ సెంటర్
బెంగళూరు: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజమైన శాంసంగ్ ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ను మంగళవారం బెంగళూరులో ప్రారంభించింది. బ్రిటిష్ కాలం నాటి ఓపెరా హౌస్‌లో ఈ సెంటర్ ప్రారంభం కాగా, కస్టమర్లు కంపెనీకి చెందిన అన్ని రకాల ఉత్పత్తులను ఇక్కడ పరిశీలించవచ్చని కంపెనీ సౌత్ వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్ సీఈఓ హెచ్ సీ హాంగ్ అన్నారు. టీవీలు, స్మార్ట్ఫోన్లు, ఫ్రిజ్‌లు, మొబైల్ యాక్సెసరీలను ఇక్కడ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. -
ఆన్లైన్ సెల్ బుకింగ్‌తో మోసం
తొర్రూరు (వరంగల్): ఆన్లైన్ సెల్ బుకింగ్‌తో ఓ యువకుడు మోసపోయాడు. తొర్రూరు పట్టణానికి చెందిన ఆబోతు కుమార్ అనే యువకుడు సుమారు రూ. 18,500 విలువ చేసే సామ్సంగ్ సెల్ కోసం గతవారం రోజుల క్రితం అన్లైన్లో బుకిం గ్ చేసుకున్నాడు. ఈ క్రమంలో సామ్సంగ్ షోరూం హైదరాబాద్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం తొర్రూరుకు వచ్చిన ఫ్యాకింగ్‌ను తీసుకుని తెరిచి చూశాడు. అందులో సామ్సంగ్ సెల్‌కు బదులు ఇనుప ముక్కతోపాటు పాతకాలం నాటి సుమారు రూ.2 వేల విలువ చేసే నోకియా సెల్, బ్యాట్రీ ఉండడంతో యువకుడు కుమార్ ఆందోళనకు గురయ్యాడు. సంబంధిత కంపెనీవారిని సమాచారం అందించినా ఏలాంటి ప్రయోజనం లేకపోవడంతో మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. -
స్పెషల్ కెమెరాతో శామ్సంగ్ గెలాక్సీ కే జూమ్
హైదరాబాద్: శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ ఇండియా కంపెనీ ప్రత్యేకమైన కెమెరాతో కూడిన సరికొత్త స్మార్ట్‌ఫోన్, గెలాక్సీ కే జూమ్‌ను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. శామ్సంగ్ గెలక్సీ స్మార్ట్‌ఫోన్‌ను డిజిటల్ కెమెరా టెక్నాలజీతో పొందాలనుకునే వారి కోసం ఈ గెలాక్సీ కే జూమ్‌ను అందిస్తున్నామని శామ్సంగ్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. నేటి(బుధవారం) నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయని, ధర రూ.29,999 అని శామ్సంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్, మొబైల్ అండ్ ఐటీ)అసిమ్ వార్సి పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్‌పై పనిచేసే ఈ ఫోన్లో 4.8 అంగుళాల హెచ్డీ సూపర్ అమోలెడ్ టచ్ స్క్రీన్, హెక్సాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమెరీ, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. 20.7 మెగా పిక్సెల్ బీఎస్ఐ సీఎంఓఎస్ సెన్సర్ కెమెరా ఉన్న ఈ ఫోన్లో ఆప్టికల్ జూమ్ 10 రెట్లు ఉంటుందని పేర్కొన్నారు. 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఎస్ హెల్త్ లైఫ్ వంటి వాల్యూ యాడెడ్ ఫీచర్లు ఉన్నాయని వివరించారు.